Share News

Ramdas Athawale: తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

ABN , Publish Date - Jul 27 , 2024 | 04:21 PM

తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్రమంత్రి రామదాస్ అథవాలే (Ramdas Athawale) తెలిపారు. శనివారం నాడు మెదక్ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

Ramdas Athawale: తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
Ramdas Athawale

మెదక్: తెలంగాణ అభివృద్ధికి కేంద్రప్రభుత్వం (Central Govt) కట్టుబడి ఉందని కేంద్రమంత్రి రామదాస్ అథవాలే (Ramdas Athawale) తెలిపారు. శనివారం నాడు మెదక్ బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి రామదాస్ అథవాలే , మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామదాస్ అథవాలే మాట్లాడుతూ... కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ సామాజిక, ఆర్థిక న్యాయం దిశగా ఉందని ఉద్ఘాటించారు. సబ్‌ కా సాత్ సబ్‌కా వికాస్ కోసం మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.


Pralhad Joshi: నీతి ఆయోగ్ సమావేశాన్ని రేవంత్ బహిష్కరించడమేంటీ.. ?

అందుకు ఏపీకి ఎక్కువ నిధులు

అన్ని వర్గాల సంక్షేమానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఎలాంటి గ్యారెంటీ అవసరం లేకుండా ముద్ర రుణాలను రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచినట్లు వ్యాఖ్యానించారు. ఉజ్వల యోజన పథకం ద్వారా ఇంటింటికీ గ్యాస్ అందిస్తున్నామని చెప్పారు. ప్రధాన మంత్రి అవాస్ యోజన పథకం ద్వారా పేదలకు 3 కోట్ల ఇల్లు ఇచ్చామని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమేనని వివరించారు. దేశంలోని 85 శాతం మంది పేదల కోసం మోదీ సర్కార్ పనిచేస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని లేకపోవడంతో ఎక్కువ నిధులు కేటాయించామని పేర్కొన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్‌కు ఒక్క ఎంపీ సీటు రాలేదని బీజేపీకి 8 ఎంపీలను ఇచ్చారని తెలిపారు. సౌత్ ఇండియాలో ఎన్డీయే మెజార్టీ స్థానాలు సాధించిందని.. అందులో తెలంగాణ, ఆంధ్రప్రదేద్ రాష్ట్రాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. తమ ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని.. ఐదేళ్లు మోదీ నేతృత్వంలో పనిచేస్తామని తెలిపారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం తమ పార్టీ పనిచేస్తుందని రామదాస్ అథవాలే పేర్కొన్నారు.


Also Read: Hari Rama Jogaiah: హరిరామ జోగయ్య మళ్లీ స్టార్ట్ చేశారు.. ఈసారి చంద్రబాబును కూడా..

సీఎం రేవంత్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు

నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి పోకున్నా రాష్ట్రానికి రావాల్సిన నిధులు వస్తాయని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) తెలిపారు. కేంద్రం రూ.26 వేల కోట్లను కేటాయించిందని రాష్ట్ర బడ్జెట్ సమావేశంలోనే ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క చెప్పారని గుర్తుచేశారు. సీఎం రేవంత్ అవగాహన లేకుండా కేంద్ర బడ్జెట్‌పై మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాజ్యాంగాన్ని మారుస్తున్నామని బట్టకాల్చి మీదేసి కాంగ్రెస్ సీట్లు పెంచుకుందని ఆరోపించారు. నెహ్రు తర్వాత మోదీ మూడేళ్లు వరుసగా ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. నాలుగోసారి గెలిచేందుకు మోదీ సర్కార్ ముందుకు సాగుతోందని వివరించారు. తెలంగాణ పేరు వచ్చిందా.. అని అడుగుతున్నారని.. సీఎం కొడంగల్‌కు కేటాయించిన నిధుల్లాగే మెదక్ నియోజకవర్గానికి కూడా రూ.4, 600 కోట్లు ఇవ్వాలి కదా అని ఎంపీ రఘునందన్ రావు ప్రశ్నించారు.


రేవంత్‌పై ప్రహ్లాద్ జోషి ఆగ్రహం

మరోవైపు.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించటంపై కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి (Minister Pralhad Joshi) తీవ్రంగా తప్పుబట్టారు. రాష్ట్రంలో కేంద్రమంత్రి శనివారం నాడు పర్యటించారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలపై రాష్ట్ర బీజేపీ నేతలతో ప్రహ్లాద్ జోషి చర్చించారు. అనంతరం హైదరాబాద్‌లోని కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీపై ప్రహ్లాద్ జోషి తీవ్ర విమర్శలు గుప్పించారు.


బీఆర్ఎస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పింది..

కాంగ్రెస్ హయాంలో ఏపీ, తెలంగాణకు కలిపి రూ.5 నుంచి 6 వేల కోట్లు మాత్రమే గ్రాంట్లు వచ్చాయన్నారు. ఎన్డీయే ప్రభుత్వం రూ.26వేల కోట్లను గ్రాంటుల రూపంలో ఇచ్చిందని తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయాల కోసం అబద్ధాలు చెప్పిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. గత ప్రభుత్వం మాదిరి వ్యవహరిస్తే.‌. కాంగ్రెస్‌కు ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఇప్పటికైనా రేవంత్ ప్రభుత్వం తప్పులను సరిచేసుకోవాలని ప్రహ్లాద్ జోషి హితవు పలికారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth: హరీష్‌రావు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ గట్టి కౌంటర్

Bandi Sanjay: కాళేశ్వరం వెళ్లి ఏం సాధించావ్ కేటీఆర్..

Damodara Rajanarasimha: 317 జీవోతో నష్టపోయిన వారి వివరాలివ్వండి

Telangana: మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రేపు వైన్స్ బంద్.. కారణమిదే..!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 27 , 2024 | 04:32 PM