TGRTC: సొంతూళ్లకు వెళ్లేవారి కోసం ఆర్టీసీ కీలక నిర్ణయం..
ABN , Publish Date - Sep 30 , 2024 | 03:59 PM
Telangana: హైదరాబాద్ శివారు నుంచి దసరాకు స్పెషల్ బస్ సర్వీసులు నడుస్తాయని టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరుకు సర్వీసులను సిద్ధం చేశామన్నారు. కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 30: మరో పదిరోజుల్లో దసరా పండుగ (Dussehra Festival) రాబోతోంది. స్కూళ్లకు దసరా సెలవులు కూడా ప్రకటించేశారు. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 15 వరకు స్కూళ్ల సెలవులు ప్రకటించింది ప్రభుత్వం (Congress Govt). దీంతో పిల్లలకు వరుస సెలవులు నేపథ్యంలో ఊరెళ్లేందుకు సిద్ధమయ్యారు ప్రజలు. తమ స్వంత గ్రామాల్లో పండగను జరుపుకునేందుకు తెలంగాణ ప్రజలు వెళ్లనున్నారు. రైళ్లు, బస్సులు, స్వంత వాహనాలల్లో తమ గ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే అనేక మంది పల్లెబాట పట్టేందుకు ఆర్టీసీ బస్సులను ఎంచుకుంటారు. పెద్ద ఎత్తున ప్రజలు సొంతూళ్లకు వెళ్లనున్న నేపథ్యంలో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఊర్లకు వెళ్లే వారి కోసమే తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది.
Rythu RunaMafi: రుణమాఫీ కానివారికి గుడ్‌న్యూస్
ప్రత్యేక బస్సులపై టీజీఆర్టీసీ ఎండీ సజ్జనార్ మాట్లాడుతూ... దసరాకు టీజీఆర్టీసీ ఆరు వేల ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హైదరాబాద్ శివారు నుంచి దసరాకు స్పెషల్ బస్ సర్వీసులు నడుస్తాయన్నారు. ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరుకు సర్వీసులను సిద్ధం చేశామన్నారు. కరీంనగర్, నిజామాబాద్ మార్గాల్లో ఎలక్ట్రిక్ సూపర్ లగ్జరీ బస్సులను అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
Nagababu: డిప్యూటీ సీఎం పవన్ సోదరుడు నాగబాబు ఆసక్తికర వ్యాఖ్యలు
సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్‌బీ, తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులను సిద్ధం చేశామన్నారు. ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరు, తదితర ప్రాంతాలకు బస్సులను నడిపేలా ప్లాన్ చేసినట్లు తెలిపారు. దసరా స్పెషల్ సర్వీసులకు సంబంధించి పూర్తి సమాచారం కోసం తమ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
Hydra: నేనడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పండి.. హైడ్రా కమిషనర్‌కు హైకోర్టు చురక
Mahalaya Amavasya 2024: మహాలయ అమావాస్య రోజు.. జస్ట్ ఇలా చేయండి చాలు..
Read Latest Telangana News And Telugu News