Stock Market: స్టాక్ మార్కెట్‌పై బేర్ దెబ్బ.. గంటల్లోనే ఆవిరైన రూ.3 లక్షల కోట్లు
ABN , Publish Date - Sep 30 , 2024 | 03:01 PM
గత రెండు వారాలుగా రికార్డు స్థాయిలను తాకిన స్టాక్ మార్కెట్లు నేడు మాత్రం నష్టాలతో దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలోనే సెన్సెక్స్ 1256, నిఫ్టీ 350కిపైగా పాయింట్లు పడిపోయాయి. అయితే ఎందుకు నష్టాల బారిన పడ్డాయనేది ఇక్కడ తెలుసుకుందాం.
దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) సోమవారం (సెప్టెంబర్ 30) భారీ నష్టాలతో కొనసాగుతున్నాయి. దాదాపు సూచీలు మొత్తం దిగువకు పయనిస్తున్నాయి. నెమ్మదిగా ప్రారంభమైన మార్కెట్ క్రమంగా క్షీణిస్తోంది. ఈ క్రమంలో మొదటి రెండు మూడు గంటల్లోనే సెన్సెక్స్, నిఫ్టీ 1 శాతానికిపైగా పడిపోయాయి. ఈ క్రమంలో మధ్యాహ్నం 2:48 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 1256 పాయింట్ల నష్టంతో 84,315 వద్ద ఉంది. ఇదే సమయంలో నిఫ్టీ 370 పాయింట్లు పతనమై 25,809 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు బ్యాంక్ నిఫ్టీ 820 పాయింట్లు నష్టపోయి 53,009 స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా ఒత్తిడికి లోనయ్యాయి.
గంటల్లోనే
మార్కెట్లు గత రెండు వారాలుగా రికార్డు స్థాయిలను తాకడం లేదా రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గత వారమే నిఫ్టీ తొలిసారిగా 26,000 కంటే పైకి వెళ్లింది. అయితే ఇక్కడి నుంచి సోమవారం ట్రేడింగ్‌లో కరెక్షన్ వచ్చింది. పెరిగిన తర్వాత ఇప్పుడు మార్కెట్లో సేల్స్ వైపు ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. అయితే ప్రాఫిట్ బుకింగ్ కాకుండా మార్కెట్ క్షీణించడం వెనుక మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఇదే సమయంలో మరికొంత మంది మదుపర్లు కొన్ని గంటల్లోనే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయారు.
స్టాక్ మార్కెట్ ఎందుకు పడిపోయింది?
ఎందుకంటే స్టాక్ మార్కెట్ డేటా ప్రకారం విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు శుక్రవారం విక్రయాలవైపు మొగ్గుచూపారు. ఆ క్రమంలో రూ. 1,209.10 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. ఇది కాకుండా గ్లోబల్ మార్కెట్లో సోమవారం భారీ క్షీణత నెలకొంది. జపాన్‌లో నిక్కీ 1800 పాయింట్ల మేర పడిపోయింది. కొత్త ప్రధానమంత్రి పేరు ప్రకటన తర్వాత వడ్డీ రేట్లు వేగంగా పెరుగుతాయనే భయం పెరిగింది. దీంతో జపాన్ స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పడిపోయాయి.
ఉద్రిక్తత కూడా..
మరోవైపు మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు కూడా మార్కెట్ క్షీణతకు ఓ కారణమని చెప్పవచ్చు. ఇరాన్ మద్దతు ఉన్న బలగాలపై ఇజ్రాయెల్ నిరంతరాయంగా దాడులకు పాల్పడుతున్న కారణంగా ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఇందులో అమెరికా పాత్ర పెరుగుతుందనే ఊహాగానాలు కూడా మార్కెట్‌ను ఆందోళనకు గురిచేశాయి. నెలల తరబడి మార్కెట్లు ఈ పరిస్థితిని గమనిస్తున్నప్పటికీ వారాంతంలో ఇజ్రాయెల్ హిజ్బుల్లా చీఫ్ సయ్యద్ హసన్ నస్రల్లాను హతమార్చడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. దీంతో ఇన్వెస్టర్లు అప్రమత్తమయ్యారు. ఈ సెంటిమెంట్ సహా పలు అంశాల నేపథ్యంలో భారత స్టాక్ మార్కెట్లు కూడా దిగువకు పయనించాయి.
ఇవి కూడా చదవండి:
Extension deadline: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. ఈ గడువు పొడిగింపు
Business Idea: ఈ వ్యాపారం ఎవర్ గ్రీన్.. రూ.50 వేల పెట్టుబడి, 11 లక్షలకుపైగా లాభం..
Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
Bank Holidays: అక్టోబర్‌లో బ్యాంకు సెలవులు ఎన్నిరోజులంటే.. పనిచేసేది మాత్రం..
Read More Business News and Latest Telugu News