Telangana: తెలంగాణలో కొత్త బీర్లు..
ABN , Publish Date - May 27 , 2024 | 08:04 PM
హైదరాబాద్, మే 27: ఇన్ని రోజులు ఏపీలో(Andhra Pradesh) మాత్రమే కొత్త కొత్త పేర్లతో బీర్లను చూశారు.. ఇప్పుడు తెలంగాణలోనూ(Telangana) కొత్త బీర్లు కిక్కు ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే కొత్త కొత్త పేర్లతో బీర్లు మార్కెట్‌లోకి రానున్నాయి. తాజాగా తెలంగాణ సర్కార్ ..
హైదరాబాద్, మే 27: ఇన్ని రోజులు ఏపీలో(Andhra Pradesh) మాత్రమే కొత్త కొత్త పేర్లతో బీర్లను చూశారు.. ఇప్పుడు తెలంగాణలోనూ(Telangana) కొత్త బీర్లు కిక్కు ఇచ్చేందుకు వచ్చేస్తున్నాయి. అతి త్వరలోనే కొత్త కొత్త పేర్లతో బీర్లు మార్కెట్‌లోకి రానున్నాయి. తాజాగా తెలంగాణ సర్కార్ సోమ్ డిస్టిల్లరీస్‌కు అనుమతి ఇచ్చింది. ఈ డిస్టిల్లరీస్ నుంచి పవర్ 1000, బ్లాక్ ఫోర్ట్, హంటర్, వుడ్ పీకర్ బీర్లు అందుబాటులోకి రానున్నాయి. దీంతో ఆయా కంపెనీల షేర్లు కొద్ది గంటల్లోనే 7 శాతం పతనమయ్యాయి. మరోవైపు తెలంగాణలో డిమాండ్ ఉన్న బీర్లు స్టాక్ దొకరడం లేదు. ఊరూ పేరు లేని బ్రాండ్లను వైన్స్ షాప్ నిర్వాహకులు అంటకడుతున్నారు. మొన్నటికి మొన్న కొత్త మద్యం విక్రయాలకు ఎవరూ అప్లై చేయలేదని మంత్రి జూపల్లి ప్రకటించారు. ఈ ప్రకటన వచ్చిన నాలుగు రోజులకే సోమ్ డిస్టిల్లరీస్‌కు అనుమతి ఇచ్చారు.
విపక్షాల ఆరోపణలు..
రాష్ట్రంలో కొత్త మద్యం విక్రయాలపై విపక్ష బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో నకిలీ మద్యాన్ని ప్రవేశపెట్టి, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో మద్యం అమ్మడానికి ఎవరికి అనుమతులు ఇవ్వలేదని ఓవైపు మంత్రి జూపల్లి ప్రకటించగా.. మరోవైపు సోమ్ డిస్టిల్లరీస్ అనే సంస్థ తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నామని ప్రకటించిందన్నారు. మంత్రి జూపల్లి అబద్ధం చెప్పారా? లేక సీఎం రేవంత్ రెడ్డే మంత్రి తెలియకుండా డీల్ చేస్తున్నారా? అని ప్రశ్నించారు. తెలంగాణను ఆగం చేసే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని క్రిశాంక్ ఫైర్ అయ్యారు.