Share News

CP Srinivas Reddy: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక నిఘా

ABN , Publish Date - Jan 11 , 2024 | 05:03 PM

ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం నాడు తన కార్యాలయంలో సీపీ శ్రీనివాస్‌రెడ్డి ( CP Kothakota Srinivas Reddy ) మీడియాతో మాట్లాడుతూ... నగరంలో ట్రాఫిక్ సెక్యురిటీ వీక్‌ని జరుపుకుంటున్నామని తెలిపారు.

CP Srinivas Reddy: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక నిఘా

హైదరాబాద్: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించే వారిపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గురువారం నాడు తన కార్యాలయంలో సీపీ శ్రీనివాస్‌రెడ్డి ( CP Kothakota Srinivas Reddy ) మీడియాతో మాట్లాడుతూ... నగరంలో ట్రాఫిక్ సెక్యురిటీ వీక్‌ని జరుపుకుంటున్నామన్నారు. ఎక్కువగా వాహనాలు సిటీలోకి రావడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. 30 శాతం పోలీసులకు రాయతీ ఇస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్, ఎడ్యుకేషన్, ఇంజనీరింగ్ మూడు కేటాగిరీలు ఉన్నాయన్నారు. నగరంలో పోలీసులు నిరంతరం ట్రాఫిక్‌ని పర్యవేక్షించాలని చెప్పారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌పై పూర్తి సమాచారం అధికారులకు ఇస్తున్నామని సీపీ తెలిపారు. స్కూల్స్ వద్ద పిల్లలకు అవగాహన కల్పించాలని కోరారు. HCSC ద్వారా ట్రాఫిక్‌పై స్కూల్స్‌లో అవగాహన కల్పిస్తున్నామన్నారు. క్విజ్ ద్వారా పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలకు ట్రాఫిక్‌‌ రూల్స్‌ని కూడా తెలియజేయాలని చెప్పారు. కార్ పుల్లింగ్ ద్వారా సమస్యలకు చెక్ పెట్టాలని ఆలోచిస్తున్నట్లు చెప్పారు. నగరంలో 31 ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు అయినట్లు తెలిపారు. కొత్త ఆలోచనలతో ట్రాఫిక్ సమస్యలకు పరిష్కార మార్గాలు తయారు చేసుకోవాలని సీపీ శ్రీనివాస్‌రెడ్డి సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 11 , 2024 | 05:08 PM