Share News

Students Protest: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. ఎందుకంటే?

ABN , Publish Date - Jul 09 , 2024 | 07:40 AM

గ్రూప్-2(Group-2) పోస్టులు పెంచాలని, డీఎస్సీ వాయిదా వేసి మెగా డీఎస్సీ(Mega DSC) ప్రకటించాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల(OU Arts College) ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఇచ్చినా అరకొర నోటిఫికేషన్లు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. నోటిఫికేషన్‌లోనూ ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని ఆర్ట్స్ కళాశాల ఎదుట బైఠాయించారు.

Students Protest: ఓయూలో విద్యార్థుల ఆందోళన.. ఎందుకంటే?

హైదరాబాద్: గ్రూప్-2(Group-2) పోస్టులు పెంచాలని, డీఎస్సీ వాయిదా వేసి మెగా డీఎస్సీ(Mega DSC) ప్రకటించాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల(OU Arts College) ఎదుట విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం లేదని, ఇచ్చినా అరకొర నోటిఫికేషన్లు ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని మండిపడ్డారు. నోటిఫికేషన్‌లోనూ ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉంటుందని ఆర్ట్స్ కళాశాల ఎదుట బైఠాయించారు. గ్రూప్-1, గ్రూప్-2పోస్టులు పెంచాలని, డీఎస్సీని వాయిదా వేసి మెగా డీఎస్సీని ప్రకటించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.


రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది నిరుద్యోగులు హైదరాబాద్, సొంత గ్రామాల్లో ఉంటూ సంవత్సరాల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తూ ప్రిపేర్ అవుతున్నారని చెప్పుకొచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం కేవలం వందల సంఖ్యల్లోనే ఉద్యోగాలు ఇస్తూ వారిని నిరాశకు గురి చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు.

Updated Date - Jul 09 , 2024 | 07:40 AM