Share News

TS News: కుళ్లిన రొయ్యలు.. గడువు ముగిసిన పన్నీర్.. ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడ్డ నిజాలు

ABN , Publish Date - Jul 03 , 2024 | 02:54 PM

Telangana: నగరంలోని టాస్క్‌ఫోర్స్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్ గూడలోని ప్రముఖ రెస్టారెంట్లపై బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. తబలారస రెస్టారెంట్‌లో కల్తీ ఆహార పదార్థాలతో వంటకాలు చేయాడాన్ని గుర్తించారు. ఫ్రిజ్‌లో కుళ్ళిన రొయ్యలు, గడువు ముగిసిన పన్నీర్, పుట్టగొడుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

TS News: కుళ్లిన రొయ్యలు.. గడువు ముగిసిన పన్నీర్.. ఫుడ్‌సేఫ్టీ అధికారుల దాడుల్లో బయటపడ్డ నిజాలు
Task force raids in Hyderabad Restaurents

హైదరాబాద్, జూలై 3: నగరంలోని టాస్క్‌ఫోర్స్ అధికారుల (Taskforce officers) దాడులు కొనసాగుతున్నాయి. గచ్చిబౌలి, నానక్‌రామ్ గూడలోని ప్రముఖ రెస్టారెంట్లపై బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. తబలారస రెస్టారెంట్‌లో కల్తీ ఆహార పదార్థాలతో వంటకాలు చేయాడాన్ని గుర్తించారు. ఫ్రిజ్‌లో కుళ్ళిన రొయ్యలు, గడువు ముగిసిన పన్నీర్, పుట్టగొడుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. నాన్ వెజ్ వంటకాల్లో మోతాదుకు మించి కలర్స్ వేస్తున్నట్లు ధ్రువీకరించారు.

TS News: అయ్యో ఎంతటి ఘోరం... ఐదేళ్ల చిన్నారి తలలో పెన్ను గుచ్చుకోవడంతో..


హకూన మటాటా చైనీస్ రెస్టారెంట్‌లో నాణ్యత లేని ఆహార పదార్థాలతో వంటలు తయారు చేస్తున్నట్లు సోదాల్లో బయటపడింది. అలాగే కిచెన్‌లో అపరిశుభ్రతమైన వాతావరణాన్ని గుర్తించారు. అయితే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సర్టిఫికెట్లు లేకుండానే రెస్టారెంట్ల నిర్వహణ జరుగుతోంది అధికారులు తెలిపారు. ఆహార పదార్థాల శాంపిల్స్‌ను ల్యాబ్ పంపించారు. అలాగే పలు రెస్టారెంట్లకు టాస్క్ ఫోర్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

Rajyasabha Updates: విపక్షాలకు ఎప్పటికీ అర్థంకాదు.. రాజ్యసభలో మోదీ సెటైర్లు..

Harishrao: ఎమ్మెల్యే పాడి కౌశిక్‌పై క్రిమినల్ కేసుపై హరీష్‌రావు రియాక్షన్

Read Latest Telangana News AND Telugu News

Updated Date - Jul 03 , 2024 | 03:02 PM