Share News

MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు దాఖలు చేసిన రెండు నామినేషన్లకు ఈసీ ఆమోదం..

ABN , Publish Date - Jul 03 , 2024 | 02:47 PM

టీడీపీ, జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మంగళవారం దాఖలు చేసిన సి.రామచంద్రయ్య (Ramachandraiah), పి.హరిప్రసాద్ (Hariprasad,) నామినేషన్లను ఎన్నికల సంఘం(Election Commission) ఆమోదించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నిక(MLC by-elections)కు జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఇప్పటివరకూ రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి.

MLC Elections: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు దాఖలు చేసిన రెండు నామినేషన్లకు ఈసీ ఆమోదం..

అమరావతి: టీడీపీ, జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థులుగా మంగళవారం దాఖలు చేసిన సి.రామచంద్రయ్య(Ramachandraiah), పి.హరిప్రసాద్(Hariprasad) నామినేషన్లను ఎన్నికల సంఘం (Election Commission) ఆమోదించింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఉపఎన్నిక(MLC by-elections)కు జారీ చేసిన నోటిఫికేషన్‌కు ఇప్పటివరకూ రెండు నామినేషన్లు మాత్రమే దాఖలు అయ్యాయి. స్క్రూటినీ ప్రక్రియ పూర్తి చేసిన ఈసీ వాటిని ఆమోదించింది. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 5వ తేదీ తుది గడువుగా ప్రకటించింది. టీడీపీ తరఫున సి.రామచంద్రయ్య, జనసేన తరఫున పి.హరిప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం అయే అవకాశం ఉంది. మంగళవారం నామినేషన్లు వేసే సమయంలో రామచంద్రయ్యతోపాటు మంత్రులు పయ్యావుల కేశవ్, ఎన్‌ఎండీ ఫరూక్‌ పాల్గొన్నారు. అలాగే హరిప్రసాద్‌తోపాటు మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్‌ పాల్గొన్నారు.


అయితే వైసీపీ అరాచకాలు భరించలేకనే ఎమ్మెల్సీ పదవీ కాలం ఇంకా మూడేళ్లు ఉన్నప్పటికీ రాజీనామా చేసినట్లు రామచంద్రయ్య నిన్న(మంగళవారం) తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీకి మంచి చేస్తారనే ఉద్దేశంతోనే పార్టీలో చేరానని, చేరిన వెంటనే ఎమ్మెల్యే పదవికి పోటీ చేసే అవకాశం కల్పించారని చెప్పారు. గతంలో పాత్రికేయుడిగా పనిచేసిన తనకు ప్రజా సమస్యలపై పూర్తి అవగాహన ఉందని జనసేన ఎమ్మెల్సీ అభ్యర్థి హరిప్రసాద్‌ అన్నారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజాప్రతినిధిగా ఇప్పుడు అవకాశం దక్కనుందని, శాసనమండలిలోకి అడుగుపెట్టి జీవితాన్ని ప్రజలకు అంకితం చేస్తానని చెప్పుకొచ్చారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుందని, ఎన్డీయే ప్రభుత్వంలో తాము భాగం కాబోతున్నందుకు సంతోషంగా ఉందని హరిప్రసాద్ తెలిపారు.

Updated Date - Jul 03 , 2024 | 02:49 PM