Telangana Assembly : ఏడో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు..
ABN , Publish Date - Jul 31 , 2024 | 10:42 AM
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏడవ రోజు బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. మంగళవారం సభ వాడీ వేడీగా జరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. భద్రాచల థర్మల్ విద్యుత్ కేంద్రం బీటీపీఎస్‌పై అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య హాట్ హాట్‌గా జరిగిన చర్చ పొలిటికల్‌గా ప్రకంపనలు సృష్టించింది.
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు (Telangana Assembly Budget Meetings) ఏడవ రోజు (7th Day) బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. మంగళవారం సభ వాడీ వేడీగా జరిగింది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలాయి. భద్రాచల థర్మల్ విద్యుత్ కేంద్రం బీటీపీఎస్‌పై అసెంబ్లీలో అధికార, విపక్షాల మధ్య హాట్ హాట్‌గా జరిగిన చర్చ పొలిటికల్‌గా ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్ ప్రభుత్వం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరులో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్లాంట్ వ్యవహారంలో ముడుపుల అంశంపై సవాళ్లు.. ప్రతి సవాళ్లతో సభలో సమరం సాగింది.
కాగా బుధవారం కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని సభాపతి రద్దు చేశారు. ఇవాళ మరికొన్ని బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.. ప్రస్తుతం దవ్య వినిమయ బిల్లుపై చర్చ జరుగుతోంది. అనంతరం బిల్లును శాసనసభ ఆమోదించనుంది. 2024 -25 ఆర్థిక సంవత్సరానికి గాను 2,91,159 కోట్లను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ద్రవ్య వినిమయ బిల్లుపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క చర్చను మొదలు పెట్టారు. దీనిపై సభలో చర్చ జరుగుతోంది. సభ్యుల ప్రశ్నలకు మంత్రి భట్టి విక్రమార్క వివరణ ఇస్తున్నారు. కాగా మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన సభ రాత్రి 10:45 నిమిషాల వరకు జరిగింది.
ఈ వార్తలు కూడా చదవండి..
నామినేటెడ్ పోస్టులు వారికే: సీఎం చంద్రబాబు
గవర్నర్‌గా నేడు జిష్ణు దేవ్ వర్మ ప్రమాణస్వీకారం
బినామీ పేర్లతో పెద్దిరెడ్డి భూముల రిజిస్ట్రేషన్..
మద్యం బాటిళ్లకు నకిలీ హోలోగ్రాం స్టిక్కర్లు..
విపక్షాలపై కేంద్రమంత్రి ఫైర్..ర్
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News