Rythu Runa Mafi: రైతు రుణమాఫీ అమలుకు కేబినెట్ నిర్ణయం
ABN , Publish Date - Jun 21 , 2024 | 07:20 PM
రైతు రుణమాఫీ (Rythu Runa Mafi) అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. తెలంగాణ ఇస్తానన్న హామీని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ నిలబెట్టుకున్నారని తెలిపారు.
హైదరాబాద్: రైతు రుణమాఫీ (Rythu Runa Mafi) అమలుకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ అని చెప్పారు. తెలంగాణ ఇస్తానన్న హామీని ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ నిలబెట్టుకున్నారన్నారు. మాట ఇస్తే మడప తిప్పని నాయకుడు రాహుల్ గాంధీ అని చెప్పారు. 2022 మే 6న వరంగల్ రైతు డిక్లరేషన్‌లో.. రూ.2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని రాహుల్ హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
రూ.2 లక్షల రైతు రుణమాఫీ హామీని నెరవేర్చామన్నారు. రైతు రుణమాఫీ కోసం రూ.31 వేల కోట్లు అవసరమని తెలిపారు. రైతు సంక్షేమం కోసం కృషి చేసే ప్రభుత్వం తమదని చెప్పుకొచ్చారు. పదేళ్లలో కేసీఆర్ చేసిన రుణమాఫీ కేవలం రూ.28 వేల కోట్లు అని తెలిపారు. అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే తాము రుణమాఫీ చేశామన్నారు. పారదర్శకంగా రైతుబంధు పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రైతు భరోసా కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించినట్లు తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందజేస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.