Home » Pending bills
ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. ఎంప్లాయిస్‌కు రావలసిన GLI, GPF బకాయిలను విడుదల చేసింది. నేరుగా నిధులు వారి అకౌంట్లలో జమ అవుతున్నాయి. బకాయిలు అకౌంట్లలో జమ అవుతున్నట్లు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ నేతలు ధృవీకరించారు.
చలో సెక్రటేరియట్ పేరిట కార్యక్రమాన్ని చేపట్టిన సర్పంచుల సంఘం నాయకులు బుధవారం వివిధ ప్రాంతాల నుంచి సచివాలయం వద్దకు చేరుకున్నారు.
జగన్ ప్రభుత్వం చెల్లింపులు చేయకుండా బకాయి పెట్టి వెళ్లిన పెండింగ్ బిల్లుల మొత్తం రూ. ఒక లక్షా ముప్ఫై వేల కోట్లు. ఈ విషయాన్ని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూశ్ కుమార్ గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అధికారికంగా వెల్లడించినట్లు సమాచారం.
గ్రామ సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని తాజామాజీ సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అక్కెనపెల్లి కరుణాకర్ డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్స్ యూనియన్ (పీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు పింగిలి శ్రీపాల్‌రెడ్డి కోరారు.
గత తెలుగుదేశం హయాంలో నీరు-చెట్టు పథకం కింద పనులు చేసిన వారు బిల్లుల కోసం ఇంకా ఎదురుచూడక తప్పట్లేదు. 2014 నుంచి 2019 వరకు నీరు-చెట్టు కింద పనులు చేశారు. తరువాత వైసీపీ అధికారంలోకి రావడంతో పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఆపేశారు. ఐదేళ్లూ అలానే గడిపేశారు. దీంతో అప్పట్లో పనులు చేసిన కాంట్రాక్టర్లు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలామంది చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేకపోతున్నారు...
సర్పంచులకు పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని, సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలని తెలంగాణ సర్పంచుల ఫోరం డిమాండ్ చేసింది.
పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారోనని ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. తహసీల్దార్లకు అద్దె వాహనాల బకాయిలు రెండేళ్లుగా చెల్లించడంలేదని, ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎస్, లోక్‌సభ ఎన్నికల్లో విధులు నిర్వహించిన ఉద్యోగుల పారితోషకం, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు, ఉద్యోగుల సరెండర్ లీవ్స్ బిల్లులు చెల్లించడంలేదని ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
డెవల్‌పమెంట్ చార్జీలు, విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించకపోతే ఎత్తిపోతల పథకాలకు సబ్స్టేషన్లు నిర్మించలేమని, కొత్త లైన్లు వేయలేమని, విద్యుత్ కూడా ఇవ్వలేమని నీటిపారుదల శాఖకు ట్రాన్స్‌కో స్పష్టం చేసింది.
పెండింగ్ బిల్లులు విడుదలచేయాలని మాజీ సర్పంచ్‌లు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు తెలిపారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లిని దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్‌రెడ్డి ఇంటికివెళ్లి వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించుకొని