Share News

Telangana DGP: ఏ సమయానికి నిమజ్జనాలు పూర్తవుతాయో చెప్పిన డీజీపీ

ABN , Publish Date - Sep 17 , 2024 | 01:12 PM

Telangana: ఈ ఏడాది వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని డీజీపీ జితేందర్ తెలిపారు. మూడు కమిషనరేట్ పరిధిలో లక్ష విగ్రహాలు నిమజ్జనం జరుగుతున్నాయన్నారు. రేపు వర్కింగ్ డే కాబట్టి ఈరోజు రాత్రిలోపే నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Telangana DGP:  ఏ సమయానికి నిమజ్జనాలు పూర్తవుతాయో చెప్పిన డీజీపీ
Telangana DGP jitender

హైదరాబాద్, సెప్టెంబర్ 17: నగరంలో గణేష్ నిమజ్జనం (Ganesh Immerssion) వైభవంగా జరుగుతోంది. ఖైరతాబాద్ మహాగణపతి (Khairatabad Ganesh) శోభయాత్రగా ట్యాంక్‌బండ్‌కు చేరుకున్నారు. క్రేన్ నెంబర్ 4 వద్ద బడా గణేష్ నిమజ్జనం జరుగనుంది. మరికాసేపట్లో మహాగణపతి గంగమ్మ ఒడికి చేరనున్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా పోలీసులు పట్టిష్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తూ భక్తులకు ఇబ్బంది కలుగకుండా చూస్తున్నారు. గణేష్ నిమజ్జనం, ఏర్పాట్లు, బందోబస్తుపై తెలంగాణ డీజీపీ జితేందర్ (Telangana DGP jitender) మీడియాకు వివరాలు వెల్లడించారు.

Rammohannaidu: అది చంద్రబాబు పనితీరు వల్లే సాధ్యం



ఆ ప్రాంతాల్లో నిమజ్జనం పూర్తి...

మంగళవారం నాడు మీడియాతో డీజీపీ మాట్లాడుతూ.. ఈ ఏడాది వినాయక నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందన్నారు. వివిధ మత పెద్దలతో రెండు సార్లు కో ఆర్డినేషన్ మీటింగ్ లెవల్ జరిగిందన్నారు. సీపీ, డీసీపీ లెవల్‌లో కూడా సమావేశాలు నిర్వహించినట్లు తెలిపారు. గణేష్ నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో కొనసాగిస్తామని హామీ ఇచ్చారన్నారు. బాలాపూర్ గణేశుడు ఇప్పటికే హైదరాబాద్ లిమిట్స్‌లో ఊరేగింపు కొనసాగుతోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా బైంసాతో పాటు మరికొన్ని ప్రదేశాల్లో నిమజ్జనం పూర్తి అయిందన్నారు.

Delh CM: ఢిల్లీ కొత్త సీఎం ఎంపిక.. ప్రకటించిన కేజ్రీవాల్


టైం టు టైం అప్రమత్తంగా ఉంటూ...

ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు, ఏర్పాట్లు చేశామన్నారు. ఖైరతాబాద్ బడా గణేష్ మరి కాసేపట్లో నిమజ్జనం జరుగుతుందన్నారు. ఈరోజు రాత్రిలోగా నిమజ్జనం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా టైం టు టైం అప్రమత్తంగా ఉంటూ ముందుకు వెళ్తామన్నారు. డీజీపీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి, పర్యవేక్షణ కొనసాగిస్తున్నామన్నారు. హైదరాబాద్‌లో సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ టీవీలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కూడా పర్యవేక్షణ కొనసాగుతుందని అన్నారు. మూడు కమిషనరేట్ పరిధిలో లక్ష విగ్రహాలు నిమజ్జనం జరుగుతున్నాయన్నారు. రేపు వర్కింగ్ డే కాబట్టి ఈరోజు రాత్రిలోపే నిమజ్జనం అయ్యేలా చర్యలు తీసుకుంటామని డీజీపీ జితేందర్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

Konda Surekha: రైతు భరోసాపై మంత్రి కొండా సురేఖ ఏమన్నారంటే?

KTR: వాళ్ల మెప్పు కోసమే రాజీవ్ విగ్రహ స్థాపన

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 17 , 2024 | 01:18 PM