Share News

TG DGP: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ డీజీపీ స్పందన

ABN , Publish Date - Aug 09 , 2024 | 01:42 PM

Telangana: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణా డీజీపీ జితేందర్ స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితులపై హైదరాబాద్‌లో కూడా నిఘా పెట్టామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న బంగ్లాదేశీయులపై నిఘా ఉంచామని... అయినా హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

TG DGP: బంగ్లాదేశ్ పరిణామాలపై తెలంగాణ డీజీపీ స్పందన
Telangana DGP Jitender

హైదరాబాద్, ఆగస్టు 9: బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణా డీజీపీ జితేందర్ (Telangana DGP Jitender) స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... బంగ్లాదేశ్ ఉద్రిక్తత పరిస్థితులపై హైదరాబాద్‌లో కూడా నిఘా పెట్టామన్నారు. హైదరాబాద్‌లో ఉన్న బంగ్లాదేశీయులపై నిఘా ఉంచామని... అయినా హైదరాబాద్‌కు అక్రమంగా వస్తే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి పరిణామాలనైన ఎదుర్కొనేందుకు తెలంగాణ పోలీస్ శాఖ సిద్ధంగా ఉందని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు.

AP HighCourt: సీఐడీ అదనపు ఎస్పీ విజయపాల్‌కు హైకోర్టులో చుక్కెదురు..


డీజీపీ ఇంకా మాట్లాడుతూ.. ప్రస్తుత డిజిటల్ ఎరాలో సైబర్ సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్‌గా మారిందన్నారు. ప్రజల సేఫ్టీ సెక్యూరిటీకి తెలంగాణ ప్రభుత్వం ప్రధాన ప్రాముఖ్యతనిస్తుందని తెలిపారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏర్పడ్డ నుంచి చాలా కేసులను పరిష్కారం చేసి.. ప్రజల డబ్బును రిఫన్డ్ చేయించారని అన్నారు. గత ఏడాది కాలంలో సైబర్ క్రైమ్ వల్ల డబులు కోల్పోయిన బాధితులకు 150 కోట్ల రూపాయలను సైబర్ సెక్యూరిటీ బ్యూరో తిరిగి ఇప్పించిందని వెల్లడించారు. ఈ హ్యాకథాన్‌లో దేశ విదేశాల నుంచి 10 వేల మంది పాల్గొంటున్నారన్నారు. ఈ హ్యాకథాన్ ద్వారా వివిధ వెబ్సైట్లు, యాప్స్‌లో ఉన్న వల్నరెబిలిటీస్‌ను కనిబెట్టనున్నారని.. ఇలాంటి హ్యకథన్ ప్రోగ్రామ్స్ భవిష్యత్‌లో కూడా నిర్వహిస్తామని తెలిపారు.

Atishi: మాట్లాడుతూనే ఏడుస్తూ..



శిఖా గోయల్, డైరెక్టర్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో చదువుకున్న వాళ్ళే ఎక్కువగా సైబర్ క్రైమ్‌కు గురవుతున్నారని అన్నారు. 70 శాతం సైబర్ క్రైమ్ బాధితులు బాగా చదువుకున్న వాళ్ళే ఉంటున్నారన్నారు. ఐటీ ఉద్యోగులే 56 శాతం సైబర్ క్రైమ్ బాధితులుగా ఉంటున్నారని చెప్పారు. ఈ హ్యాక్‌థాన్‌లో 20 దేశాలకు చెందిన వారు ఆన్‌లైన్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారన్నారు. ఈ హ్యాక్‌థాన్‌లో గెలిచిన వారితో సైబర్ సెక్యూరిటీ బ్యూరో కలిసి పని చేస్తుందన్నారు. సైబర్ సెక్యూరిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. భావేశ్ మిశ్రా, డిప్యూటీ సెక్రటరీ, ఐటీ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతీ నిమిషానికి 2 సైబర్ క్రైమ్ కేసులు నమోదవుతున్నాయన్నారు. ఇంకా చాలా మంది సైబర్ క్రైమ్‌కు గురైనా... ముందుకు వచ్చి కంప్లెయింట్ చేయడం లేదన్నారు. గతేడాది సైబర్ క్రైమ్ వల్ల 7,500 కోట్ల రూపాయలు కోల్పోయారన్నారు. ఈ హ్యాక్‌థాన్‌లో చాలా మంది పార్టిసిపేట్ చేయడం మంచి పరిణామమన్నారు. ఏ ప్రొడక్ట్ తయారు చేసినా... సెక్యూరిటీ ప్రధానంగా ఉండేలా చూసుకోవాలని డీజీపీ జితేందర్ సూచించారు.


ఇవి కూాడా చదవండి..

Health Tips : ఆహారంలో వెన్న ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుంది.

Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌ టూర్ వివరాలు.. వెళ్తే తప్పక ఇవి చూడండి..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 09 , 2024 | 01:49 PM