Share News

Telangana ECET Results: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల

ABN , Publish Date - May 20 , 2024 | 01:25 PM

Telangana: తెలంగాణ ఈ-సెట్ (తెలంగాణ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ఈ-సెట్ ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఈసెట్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల 330 మంది విద్యార్థులు ఈ సెట్ రాయగా..

Telangana ECET Results: తెలంగాణ ఈసెట్ ఫలితాలు విడుదల
Telangana ECET Results released

హైదరాబాద్, మే 20: తెలంగాణ ఈ-సెట్ (తెలంగాణ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ఫలితాలు (Telangana ECET Reults 2024) విడుదలయ్యాయి. సోమవారం ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రి ఈ-సెట్ ఫలితాలను విడుదల చేశారు. పాలిటెక్నిక్ విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజీల్లో చేరేందుకు ఈసెట్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 23 వేల 330 మంది విద్యార్థులు ఈ సెట్ రాయగా.. వారిలో 22 వేల 365 మంది విద్యార్థులు క్వాలిఫై అయినట్లు లింబాద్రి వెల్లడించారు.

AP Elections 2024: మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన గెలుస్తారా..!?


తెలంగాణ (Telangana) ఈ సెట్‌లో 95.86% శాతం మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారన్నారు. ఈ సెట్ బీఎస్సీ మ్యాథ్స్‌లో పెద్దపల్లికి చెందిన యాదగిరి మొదటి ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. ఈ సెట్ కెమికల్ ఇంజనీరింగ్‌లో ఏపీకి చెందిన మనోహర్ మొదటి ర్యాంక్ సాధించారన్నారు. ఈసెట్‌లో క్వాలిఫైన వారికి ఉన్నత విద్యా మండలి చైర్మన్ అభినందనలు తెలియజేశారు. జూన్ 2 నుంచి ఈ సెట్ అడ్మిషన్లు మొదలవుతాయని లింబాద్రి వెల్లడించారు.

TS News: సెక్రటేరియట్‌కు వీసీల పంచాయతీ...


కాగా.. ఈనెల 6వ తేదీన తెలంగాణ ఈసెట్ పరీక్షను నిర్వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈసెట్ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 99 కేంద్రాలను ఏర్పటు చేశారు. మొత్తం 200 మార్కులకు గానూ ఆన్‌లైన్ విధానంలో ఈ రాత పరీక్ష జరిగింది. ఇంజినీరింగ్, ఫార్మసీ, బీస్సీ మ్యాథమెటిక్స్ విభాగాలకు ఈ పరీక్ష జరిగింది.


ఇవి కూడా చదవండి...

KTR: అది మా తప్పేనంటూ ఒప్పుకున్న కేటీఆర్

Viral News: పిల్లికి ``డాక్టర్ ఆఫ్ లిటరేచర్`` అవార్డు.. దాని వెనుకున్న ఆసక్తికర కారణం ఏంటంటే..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 20 , 2024 | 01:28 PM