PM Modi: ఇరాన్ అధ్యక్షుడు మృతిపై ప్రధాని మోదీ సంతాపం
ABN , Publish Date - May 20 , 2024 | 11:42 AM
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇబ్రహీం రైసీ మృతిపై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ‘ఇబ్రహీం రైసీ మృతి విచారకరం. రైసీ మరణ వార్త తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఇరాన్- భారతదేశం మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం కోసం రైసీ చేసిన కృషిని మరవలేం. రైసీ కుటుంబ సభ్యులు, ఇరాన్ ప్రజలకు సంతాపం తెలియజేస్తున్నా. ఈ కష్ట సమయంలో ఇరాన్‌కు భారతదేశం అండగా నిలుస్తోంది అని’ ప్రధాని మోదీ పేర్కొన్నారు.
అండగా ఉంటాం
‘ఇబ్రహీం రైసీ, విదేశాంగ మంత్రి హెచ్ అమీర్ మృతి తనను తీవ్రంగా కలచి వేసింది. ఆ ఇద్దరు నేతలతో పలు సమావేశాల్లో పాల్గొన్నా. ఈ జనవరిలో ఓ సమావేశంలో కలిశాం. ఇద్దరు నేతల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం. ఈ కఠిన సమయంలో ఇరాన్ ప్రజలకు అండగా నిలబడతాం అని’ విదేశాంగ మంత్రి జై శంకర్ ట్వీట్ చేశారు.
కుప్పకూలి..
ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఆనకట్ట ప్రారంభోత్సవానికి వెళ్లి తిరిగి వస్తోన్న సమయంలో హెలికాప్టర్ అదుపుతప్పి తూర్పు అజర్ బైజాన్ సరిహద్దుల్లో గల జోల్ఫా ప్రాంతంలో ఆదివారం కుప్పకూలింది. వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. హెలికాప్టర్ కాలిపోవడంతో అందులో ఉన్న అధ్యక్షుడు రైసీ, విదేశాంగ మంత్రి, పలువురు అధికారులు మృతిచెందారు.
Read Latest International News and Telugu News