Share News

Group -1 Candidates: సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులు

ABN , Publish Date - Oct 18 , 2024 | 04:49 PM

Telangana: జీవో 29 ని రద్దు చేయాలంటూ గ్రూప్-1 అభ్యర్థులు సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేశారు. జీవో 29 వల్ల జరిగే నష్టాన్ని ప్రధాన న్యాయమూర్తికి తమ న్యాయవాది వివరించారని అభ్యర్థులు తెలిపారు. సోమవారం (అక్టోబర్ 21) రోజు మొదటి కేసుగా తీసుకొని విచారిస్తామని వాయిదా వేసినట్లు చెప్పారు.

Group -1 Candidates: సుప్రీంను ఆశ్రయించిన తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులు
Telangana Group-1 Candidates

న్యూఢిల్లీ, అక్టోబర్ 18: తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థులు (Telangana Group-1 Candidates) సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. జీవో 29ను రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. జీవో 29 వల్ల జరిగే నష్టాన్ని ప్రధాన న్యాయమూర్తికి తమ న్యాయవాది వివరించారని అభ్యర్థులు తెలిపారు. సోమవారం (అక్టోబర్ 21) రోజు మొదటి కేసుగా తీసుకొని విచారిస్తామని వాయిదా వేసినట్లు చెప్పారు. జీవో 55నే అమలు చేయాలని కోరినా.. సీఎం రేవంత్ రెడ్డి పెడచెవిన పెట్టారని అన్నారు. సుప్రీంకోర్టుతో మొట్టికాయలు కొట్టించుకోక ముందే ప్రభుత్వం దిగివచ్చి జీవో 29ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. హైడ్రా గురించి మాట్లాడుతున్న సీఎం... జీవో 29 వల్ల నష్టపోయే విద్యార్థులవైపు నిలబడాలని డిమాండ్ చేశారు.

Pro Kabaddi League: కబడ్డీ ప్రియులకు అదిరిపోయే న్యూస్.. తెలుగు టైటాన్స్ వైపే అందరి చూపు..


అశోక్ నగర్‌లో ఇప్పటికి దాడులు చేస్తున్నారన్నారు. గ్రూప్-1 చదివే విద్యార్థులపై దాడులు, పోలీసు స్టేషన్‌లో ఉంచి ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కోర్టు తీర్పు వచ్చేదాకా గ్రూప్ -1 మెయిన్స్‌ను రద్దు చేయాల్సిందే అని గ్రూప్ వన్ అభ్యర్థులు పట్టుబట్టారు. తెలంగాణ 2.0 ఉద్యమాన్ని మళ్ళీ చూస్తారని హెచ్చరించారు. జీవో 29 గ్రూప్ 1 విద్యార్థులకు శాపంగా మారిందన్నారు. సీఎం మొండిగా ఎందుకు వెళ్తున్నారో చెప్పాలన్నారు. రాజ్యాంగాన్ని కాపాడాలని రాహుల్ గాంధీ చెప్తుంటే, సీఎం ఆ స్ఫూర్తిని తుంగలో తొక్కేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

Manappuram Finance: మణప్పురం ఫైనాన్స్‌‌కు భారీ షాక్.. 11 నెలల కనిష్టానికి షేర్లు


2022లో కేసీఆర్ జీవో 55 తెచ్చారని.. గ్రూప్-1 లో రిజర్వేషన్లు అమలు అయ్యేలా తీసుకొచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జీవో 29 తీసుకొచ్చారని.. దీని వల్ల గ్రూప్-1 అభ్యర్థులకు నష్టం జరుగుతుందన్నారు. సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుందనే ఆశాభావం ఉందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అశోక్ నగర్ వచ్చి విద్యార్థులతో మాట్లాడి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వికీపీడియాలో సోర్స్ తీసుకున్నామని చెప్పడం హాస్యాస్పదమని... వికీపీడియాను ఎలా నమ్ముతారని గ్రూప్ వన్ అభ్యర్థులు ప్రశ్నించారు.


హైకోర్టు డిస్మస్...

గ్రూప్- 1 ప్రిలిమ్స్ పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసిన విషయం తెలిసిందే. వివిధ కారణాలతో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలపై హైకోర్టులో (Telangana High Court) అభ్యర్థులు పలు పిటిషన్‌లు దాఖలు చేశారు. ఇటీవల ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణకు వచ్చింది. గ్రూప్‌-1‌ ప్రిలిమ్స్ పరీక్షలపై దాఖలైన రెండు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. గ్రూప్ 1లో తప్పుడు ప్రశ్నలను తొలగించాలని ఒక పిటిషన్ దాఖలవగా.. ప్రిలిమీనరీ కీ లో తప్పులు ఉన్నాయని, కీ ని రీ నోటిఫికేషన్ చేయాలని మరో పిటిషన్‌ను అభ్యర్థులు దాఖలు చేశారు. తప్పుడు ప్రశ్నలు తొలగించి మళ్లీ మెరిట్ జాబితాను విడుదల చేయాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది. త్వరలో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు జరగబోతున్నాయని ఈ సమయంలో న్యాయస్థానం జోక్యం చేసుకుంటే మెయిన్స్ విద్యార్థులు నష్టపోతారని టీజీపీఎస్‌సీ కోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పిటిషన్‌లను కొట్టివేసింది. దీంతో ఈనెల 21 నుంచి గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు యథావిధిగా జరుగనున్నాయి.


ఇవి కూడా చదవండి..

Harish Rao: సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీష్‌ ఏ రేంజ్‌లో సవాల్ విసిరారంటే

Vice Chancellor: తెలంగాణలో 9 యూనివర్సిటీలో వీసీల నియామకం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Oct 18 , 2024 | 04:55 PM