Share News

Hyderabad: ఆ ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేసిన తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్..

ABN , Publish Date - Nov 06 , 2024 | 05:37 PM

తెలంగాణ రాష్ట్రంలో వ్యాయామ విద్యా వ్యవస్థపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శాగంటి రాజేశ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యాయామ విద్యా వ్యవస్థను పరిశీలించి పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.

Hyderabad: ఆ ముఖ్యమంత్రికి పాలాభిషేకం చేసిన తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్..

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్పోర్ట్స్ పాలసీ కింద క్రీడా రిజర్వేషన్లు మూడు శాతం పెంచడంపై తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో ఇవాళ (బుధవారం) ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ సభ్యులు పాలాభిషేకం చేశారు. అదే విధంగా డీఎస్సీలో 1,600లకు పైగా పిఈటీ, పీడీ పోస్టులు వేయాలని నిర్ణయం తీసుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ తరఫున చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.


తెలంగాణ రాష్ట్రంలోనూ వ్యాయామ విద్యా వ్యవస్థపై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి పెట్టాలని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శాగంటి రాజేశ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యాయామ విద్యా వ్యవస్థను పరిశీలించి పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యాయామ విద్య ఉపాధ్యాయులకు సంబంధించి 1,600లకు పైగా పిఈటీ, పీడీ ఖాళీలను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని రాజేశ్ డిమాండ్ చేశారు. ఇతర రాష్ట్రాలకు చెందిన చాలా మంది వ్యక్తులు ఎటువంటి స్పోర్ట్స్ బ్యాక్ గ్రౌండ్ లేకపోయినా ఆయా రాష్ట్రాల్లో సర్టిఫికెట్లు తెచ్చుకుని తెలంగాణలో ఉద్యోగాలు సంపాదిస్తున్నారని ఆయన మండిపడ్డారు.


ఇలాంటి మోసాల వల్ల తెలంగాణ క్రీడాకారులకు అన్యాయం జరుగుతోందని రాజేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ఆయన డిమాండ్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబుకు పాలాభిషేకం కార్యక్రమంలో తెలంగాణ స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు, ఫౌండర్ శాగంటి రాజేశ్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సలికంటి వినోద్, ఉస్మానియా యూనివర్సిటీ ఎస్ఎస్ఎఫ్ నాయకులు రమేశ్, ప్రసాద్, ప్రశాంత్, మహేశ్, సమ్మయ్య, వెంకటేశ్, తిరుమలేశ్, జంపన్న, తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి..

Bhanu kiran: చంచల్‌గూడ జైలు నుంచి భాను కిరణ్ విడుదల

Hyderabad: గోల్డ్‌ స్కీమ్‌లో చేరాలని ఫోన్లు వస్తున్నాయా.. అయితే..

Formula E Racing: దూకుడు పెంచిన ఏసీబీ

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 06 , 2024 | 05:37 PM