Minister Raja Narasimha: ఖమ్మం ర్యాగింగ్ ఘటనపై మంత్రి రాజనర్సింహ ఆగ్రహం..
ABN , Publish Date - Nov 17 , 2024 | 03:57 PM
ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మెుదటి సంవత్సరం విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు.
ఖమ్మం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మెుదటి సంవత్సరం విద్యార్థికి గుండు కొట్టించిన ఘటనపై తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ర్యాగింగ్ గురించి తెలిసిన వెంటనే ఉన్నతాధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గుండు కొట్టిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తక్షణమే విచారణ చేపట్టాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఇలాంటి ఘటనలు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ర్యాగింగ్ పేరిట భవిష్యత్తు పాడుచేసుకోవద్దని విద్యార్థులకు మంత్రి సూచించారు. ర్యాగింగ్ భూతం వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పోలీస్ శాఖ సహకారం తీసుకుని అన్ని కాలేజీల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
అసలేం జరిగిందంటే?
ములుగుకు చెందిన విద్యార్థి ఖమ్మం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మెుదటి సంవత్సరం చదువుతున్నాడు. అయితే అతను చైనా వాళ్ల మాదిరిగా వింతగా కటింగ్ చేయించుకుని తరగతులకు హాజరవుతున్నాడు. ఈ విషయాన్ని గమనించిన సీనియర్ విద్యార్థులు అతన్ని మందలించారు. ఉన్నతమైన విద్యను చదువుతున్నామని, ఇలా హెయిర్ కట్ చేయించుకోవడం మంచిది కాదని చెప్పారు. దీంతో అతను సెలూన్ షాపునకు వెళ్లి హెయిర్ ట్రిమ్ చేయించుకుని వచ్చాడు. అక్కడి వరకూ బాగానే ఉంది. అయితే హెయిల్ స్టైల్ విషయం కాస్త కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్‌కి తెలిసింది. దీంతో ఆగ్రహించిన అతను విద్యార్థిని తీసుకెళ్లి ఏకంగా గుండు కొట్టించాడు.
మనస్తాపం చెందిన యువకుడు విషయాన్ని కళాశాల ప్రిన్సిపల్ రాజేశ్వరరావు దృష్టికి తీసుకెళ్లాడు. బాయ్స్ హాస్టల్ యాంటీ ర్యాగింగ్ కమిటీ ఆఫీసర్‌గా ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసరే విద్యార్థికి గుండు కొట్టించడంపై మండిపడ్డారు. అనంతరం అతడిని కళాశాల యాజమాన్యం విధుల నుంచి తొలగించింది. అలాగే ఘటనను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దృష్టికి తీసికెళ్లి, విచారణకు ఫోర్‌మెన్ కమిటీ నియమించారు. ఈ విషయం కాస్త మంత్రి దామోదర రాజనర్సింహ దృష్టికి రావడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేస్తూ విచారణకు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Konda Surekha: ఫోన్ ట్యాపింగ్‌పై షాకింగ్ విషయాలు బయటపెట్టిన మంత్రి కొండా సురేఖ
Bandi Sanjay : తెలంగాణలో ఆర్కే బ్రదర్స్ పాలన.. బండి సంజయ్ సంచలన ఆరోపణలు