Share News

Minister Thummala: గంజాయి, డ్రగ్స్‌‌పై ఫోకస్ పెట్టాలి.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

ABN , Publish Date - Dec 07 , 2024 | 12:32 PM

ఖమ్మం చరిత్ర తెలిపేలా ఖిల్లాపై రోప్‌వే ఏర్పాటుతో పర్యాటక అభివృద్ధి చెందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పెరుగుతున్న అర్బన్ పాపులేషన్‌కు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఖమ్మం నగరం పరిశుభ్రంగా విశాలమైన రహదారులు పచ్చదనంతో ఇతర నగరాలకు ఆదర్శంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Minister Thummala: గంజాయి, డ్రగ్స్‌‌పై ఫోకస్ పెట్టాలి.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

ఖమ్మం: విద్యార్థులు గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడకుండా పోలీస్‌లు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఖమ్మం నగరంలో మామిళ్ళగూడెం, సారథి నగర్ కాలనీలను అనుసంధానం చేసే రైల్వే అండర్ మినీ బ్రిడ్జిని ఇవాళ(శనివారం) మంత్రి తుమ్మల ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ....ఖమ్మం నగరంలో ట్రాఫిక్ కష్టాలు లేకుండా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేగా ఉన్నపుడు అండర్ బ్రిడ్జిని తాను శాంక్షన్ చేశానని.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నపుడు శంకుస్థాపన చేశానని గుర్తుచేశారు. ప్రజా పాలన ఏడాదిలో అర్.యుబీ ప్రారంభోత్సవం చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.


ఖమ్మం నగరంలో విశాలమైన రహదారులు, పార్క్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. 500 ఎకరాలు ఉన్న వెలుగుమట్ల పార్క్‌ను ఖమ్మం నగరానికి పర్యాటక ప్రదేశంగా ల్యాండ్ మార్క్‌గా అభివృద్ధి చేశానని తెలిపారు. ఖమ్మం చరిత్ర తెలిపేలా ఖిల్లాపై రోప్‌వే ఏర్పాటుతో పర్యాటక అభివృద్ధి చెందుతుందని అన్నారు. పెరుగుతున్న అర్బన్ పాపులేషన్‌కు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఖమ్మం నగరం పరిశుభ్రంగా విశాలమైన రహదారులు పచ్చదనంతో ఇతర నగరాలకు ఆదర్శంగా ఉండాలని అన్నారు. నాలాలు పూడ్చి అక్రమ కట్టడాలు నిర్మించడం వల్లే మున్నేరుకు వరద ముంపు గండం వచ్చిందని చెప్పారు. అడవులను కొట్టడం వల్లే కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయని తెలిపారు. ఖమ్మం విప్లవాల పురిటిగడ్డ అన్నారు. స్వాతంత్ర సంగ్రామంలో నైజాం రజాకార్లను తరిమి కొట్టిన జిల్లా ఖమ్మం జిల్లా అని ఉద్ఘాటించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలనలో తనకు మంత్రిగా అవకాశం ఇచ్చిన ఖమ్మం ప్రజలకు తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.


కామారెడ్డి జిల్లాను టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి జూపల్లి కృష్ణారావు

jupalli-krishna-rao.jpg

కామారెడ్డి: నిజాంసాగర్ ప్రాజెక్టులో ఏడాది అంతా నీరు ఉంటుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి శివారులో గల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని మంత్రి జూపల్లి, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు, జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... కామారెడ్డి జిల్లాను టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. నిజాంసాగర్‌ను టూరిజం కేంద్రంగా ఏర్పాటు చేస్తూ త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు. జల విద్యుత్ కేంద్రంలో నిలిచిన విద్యుత్ ఉత్పత్తిని త్వరలో పునరుద్ధరిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి

TG NEWS: కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల కీలక భేటీ.. కారణమిదే

KTR: రేవంత్ ప్రభుత్వం అన్నదాతల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది.. కేటీఆర్ ధ్వజం

CM Revanth Reddy: డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విచారణకు.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

Komatireddy Venkatareddy: ఇక బెనిఫిట్‌ షోలకు అనుమతివ్వం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 07 , 2024 | 12:36 PM