KTR: ఆ హత్యలో మంత్రి పాత్ర లేకపోతే పోలీసులకు సహకరించాలి: కేటీఆర్
ABN , Publish Date - May 23 , 2024 | 08:47 PM
మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) పోద్బలంతో నియెజకవర్గంలో రెండు హత్యలు జరిగాయని.. వెంటనే ఆయనను మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) డిమాండ్ చేశారు.
హైదరాబాద్: మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupalli Krishna Rao) ప్రోద్బలంతో నియోజకవర్గంలో రెండు హత్యలు జరిగాయని, వెంటనే ఆయనను మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR) డిమాండ్ చేశారు.
నాలుగు నెలల కాలంలోనే ఇద్దరి హత్యలకు కారణమైన మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రివర్గం నుంచి సస్పెండ్ చేయాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ డిమాండ్ చేశారు. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో బొడ్డు శ్రీధర్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
శ్రీధర్ రెడ్డి హత్యకు జూపల్లి కృష్ణారావే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇది మొదటి హత్య కాదు. పేరుకేమో ప్రజాపాలన.. చేస్తున్నది ప్రతీకార పాలన. ప్రతీకారంతో రగిలిపోతూ ఎన్నికల్లో వత్తాసు పలకని వారి మీద ప్రతీకారం తీర్చుకునే దిక్కుమాలిన పాలన.. ఇది కాంగ్రెస్ పాలన. ఈ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
తమ నేతలపై దాడులు, హత్యలు జరుగుతున్నాయని వినతి పత్రాలు ఇచ్చారని గుర్తుచేశారు. బీఆర్ఎస్ నేతలపై దాడులు, హత్యలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించి చర్యలు తీసుకోవాలని, లేకపోతే కాంగ్రెస్ నేతల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. మరణించిన శ్రీధర్ రెడ్డి తండ్రి పిటిషన్‌పై జూపల్లి కృష్ణారావు పేరు రాస్తే పోలీసులు మంత్రి పేరు తీసేయాలని ఒత్తిడి తెస్తున్నారన్నారు.
రాష్ట్రంలో ఎక్కడా లేని ఫ్యాక్షన్ సంస్కృతిని మంత్రి జూపల్లి కొల్లాపూర్‌లో తీసుకొచ్చారని చెప్పారు. జనవరిలో మల్లేష్ యాదవ్, ఇప్పుడు శ్రీధర్ రెడ్డి హత్యకు జూపల్లి కారణమయ్యారని ఆరోపించారు. హత్యలో మంత్రి పాత్ర లేకపోతే పోలీసులకు సహకరించాలని కోరారు. నాలుగు రోజుల క్రితం నియెజకవర్గంలో దాడులు, హత్యలు జరుగుతున్నాయని డీజీపీని తమ పార్టీ నాయకులు కలిశారని చెప్పారు.
బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఆ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. బీఆర్ఎస్ నేత హత్య జరిగిన పట్టించుకోని పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పేరుకేమో ప్రజా పాలన.. కానీ ఇక్కడే జరిగేది మాత్రం ప్రతికార్య పాలన అని విమర్శించారు. బీఆర్ఎస్ శ్రేణుల జోలికి కాంగ్రెస్ నేతలు వస్తే చూస్తు ఊరుకోమని కేటీఆర్ హెచ్చరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
టీడీపీ నేత డీజే శివపై వైసీపీ మూకల దాడి..
నెల్లూరు విక్రమ సింహపురి వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్..
టార్గెట్ ఎమ్మెల్సీ.. ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ..
ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి అరాచకాలు..
కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..
నిర్మల్ జిల్లాలో రోడ్డు ప్రమాదం..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News