Adilabad: అశ్రునయనాల మధ్య రమేశ్ రాథోడ్ అంత్యక్రియలు..
ABN , Publish Date - Jul 01 , 2024 | 04:28 AM
దివంగత మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువులు, నాయకుల ఆశ్రునయనాల మధ్య ఆదివారం జరిగాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎక్స్‌రోడ్డు సమీపంలోని రాథోడ్ రమేశ్ వ్యవసాయ క్షేత్రంలో దహన సంస్కారాలు పూర్తి చేశారు.
ఉట్నూర్, జూన్ 30: దివంగత మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్ అంత్యక్రియలు కుటుంబ సభ్యులు, బంధువులు, నాయకుల ఆశ్రునయనాల మధ్య ఆదివారం జరిగాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలోని ఎక్స్‌రోడ్డు సమీపంలోని రాథోడ్ రమేశ్ వ్యవసాయ క్షేత్రంలో దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఉమ్మడి జిల్లాలోని ప్రజలు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. దీంతో పోలీసులు గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. అంతకు ముందు రమేశ్ రాథోడ్ భౌతిక కాయానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నివాళులర్పించారు. ఆయన వెంట ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ ఉన్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ మునుగోడు ఎన్నికల్లో తన వెంట ఉండి నడిపించిన మహానీయుడు రమేశ్ అని, ఆయన మరణం పార్టీకి తీరని లోటు అని అన్నారు. రమేశ్ రాథోడ్ మృతి పట్ల ప్రధాని మోదీతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్, బీజేపీ శాసనసభ పక్షనేత మహేశ్వర్‌రెడ్డి, సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హారీ్‌షరావు, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మిలు రమేశ్ రాథోడ్ భౌతిక కాయానికి నివాళులర్పించారు.