Share News

CM Revanth : కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు

ABN , Publish Date - Jul 09 , 2024 | 03:22 PM

డిసెంబర్ 2025 నాటికి కల్వకుర్తి పనులు మొత్తం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ నెల 14 లేదా 15న ఇరిగేషన్ మంత్రితో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఆ రోజు తుది అప్రూవల్ తీసుకోవాలని ఆదేశించారు.

CM Revanth :  కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై కీలక ఆదేశాలు
CM Revanth Reddy

మహబూబ్‌నగర్: డిసెంబర్ 2025 నాటికి కల్వకుర్తి పనులు మొత్తం పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. ఈ నెల 14 లేదా 15న ఇరిగేషన్ మంత్రితో సమీక్ష సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. ఆ రోజు తుది అప్రూవల్ తీసుకోవాలని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

జిల్లాలో సీఎం రేవంత్‌రెడ్డి ఈరోజు (మంగళవారం) పర్యటించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి జిల్లా అభివృద్ధిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అలాగే సాగునీరు, విద్య, వైద్యం, పలు అంశాలపై చర్చించారు.


ప్రతి నెల ప్రాజెక్ట్ పనులను సమీక్షిస్తానని స్పష్టం చేశారు. ఇక ప్రాజెక్ట్ పనులు ఆలస్యం కాకూడదని అన్నారు. మహబూబ్‌నగర్ కలెక్టరేట్‌లో అధికారులు, ప్రజాప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై అధికారులకు ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు జారీ చేశారు. డిసెంబర్ 2025లోగా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేయాల్సిందేనని స్పష్టం చేశారు. ఫీల్డ్ విజిట్ చేసి యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ప్రతీ నెలా ప్రాజెక్టు పనుల్లో పురోగతిపై సమీక్ష నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.


సీఎం ఆదేశాలతో పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు పరుగులు పెట్టనున్నాయి. కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలో భాగంగా కొత్తగా రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టనున్నారు. మహబూబ్ నగర్‌లో ఎన్.ఐ.టీ కోసం స్థానిక ఎమ్మెల్యే.. యెన్నం శ్రీనివాసరెడ్డి పట్టుబడుతున్నారు. సాయంత్రం 6 గంటల వరకు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన జిల్లాలో కొనసాగనున్నది. జిల్లాలో సీఎం పర్యటన బిజీ బిజీగా ఉండనున్నది.


పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  • జిల్లాలో మొత్తం 396.09 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభం

  • రూ.353.66 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  • పాలమూరు యూనివర్సిటీలో రూ.42.40 కోట్లతో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభం, రూ.13.44 కోట్లతో ఎస్టీపీ, అకడామిక్ బ్లాక్, గ్యాలరీ పనులకు శంకుస్థాపన

  • ఎంవీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రూ.10 కోట్లతో బాలికల హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన

  • దేవరకద్రలో రూ.6.10కోట్లతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన

  • మహబూబ్‌నగర్ రూరల్‌లో రూ.3.25 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

  • గండీడ్‌లో రూ.6.20 కోట్లతో కేజీవీబీ భవన నిర్మాణానికి శంకుస్థాపన

  • మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో రూ.37.87 కోట్లతో సీసీ రోడ్లు, స్టోరేజ్ ట్యాంక్ పనులు, రూ.276.80 కోట్లతో ఎస్టీపీ నిర్మాణానికి శంకుస్థాపన

Updated Date - Jul 09 , 2024 | 03:52 PM