Share News

TS Politics: మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం.. యెన్నం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Jan 27 , 2024 | 03:49 PM

మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టారు.. ఈ విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు.

TS Politics: మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో నెగ్గిన అవిశ్వాసం.. యెన్నం శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టారు.. ఈ విషయంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్.. చైర్మన్, వైస్ చైర్మన్లను డమ్మీలుగా పెట్టి అవినీతికి పూనుకున్నారని ఆరోపించారు. శనివారం నాడు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో మొత్తం 49 మంది సభ్యులున్నారని. వీరిలో 36 మంది చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసం పెట్టినట్లు తెలిపారు.

మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో గత నాలుగేళ్ల పాలన రాజ్యాంగ బద్దంగా జరగలేదన్నారు. మున్సిపాలిటీకి చెందిన నిధులు ఇతర పనులకు తరలించి మున్సిపాలిటీ అభివృద్ధిని కుంటుపట్టించారని మండిపడ్డారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ నిరంకుశ పాలనకు విసిగి వేసారిన కౌన్సిలర్లు ఆత్మగౌరవం కోసం అవిశ్వాసానికి ఓటేశారని చెప్పారు. చరిత్రను తిరగరాస్తూ... మహబూబ్ నగర్ మున్సిపాలిటీలో అన్ని పార్టీల కౌన్సిలర్లు ఏకమయ్యారని తెలిపారు. మిగిలిన ఏడాది పాలనలో తమ వార్డులను అభివృద్ధి చేసుకోవడం కోసం అవిశ్వాసంతో కాంగ్రెస్ వెంట వచ్చారని చెప్పారు. అవిశ్వాసానికి మద్దతు తెలిపిన బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ కౌన్సిలర్లందరికీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jan 28 , 2024 | 07:53 AM