Yennam Srinivas Reddy: అలా చేసే దమ్ముందా.. BRSకు కాంగ్రెస్ MLA సవాల్
ABN , Publish Date - Jul 30 , 2024 | 07:03 PM
BRS పార్టీ పేరులో B తొలగించి T పెట్టే దమ్ముందా అని మాజీ మంత్రి కేటీఆర్‌కు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) సవాల్ విసిరారు. DMK,TDP లాంటి పార్టీలకు ఒక ఫిలాసఫీ ఉందని బీఆర్ఎస్‌కి ఏ ఫిలాసిఫీ ఉందని ప్రశ్నించారు.
మహబూబ్‌నగర్: BRS పార్టీ పేరులో B తొలగించి T పెట్టే దమ్ముందా అని మాజీ మంత్రి కేటీఆర్‌కు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) సవాల్ విసిరారు. DMK,TDP లాంటి పార్టీలకు ఒక ఫిలాసఫీ ఉందని బీఆర్ఎస్‌కి ఏ ఫిలాసిఫీ ఉందని ప్రశ్నించారు. అధికారం ఉన్నపుడే బీఆర్ఎస్ కాంగ్రెస్‌ను ఏం చేయలేకపోయిందని.. ఇప్పుడేం చేస్తారని అన్నారు.
గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డికి ఓపిక లేదని.. నియోజకవర్గంలో ఆయన చెప్పినట్లు పార్టీ యావత్ ప్రాధాన్యం ఇచ్చిందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన మనుషులకు అవకాశాలు ఉండాలి అని అడిగారని.. దానికీ కుడా సరే అన్నామని చెప్పారు.
Also Read: Justice Lokur: తెలంగాణ విద్యుత్ కమిషన్ ఛైర్మన్‌గా జస్టిస్ లోకూర్
జిల్లాలో బీసీ మహిళా అయిన జెడ్పీ చైర్మన్‌ను ఎక్కడికి రావొద్దన్నారని.. ఆమెను అధికార కార్యక్రమాలకు పిలవద్దు అన్నారని ఇది సాధ్యం కాదని తేల్చి చెప్పామని అన్నారు. గుర్తుచేశారు. మంగళవారం నాడు శ్రీనివాస్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. ఒక ఎమ్మెల్యే అయి ఉండి పార్టీలో అధికారులపై గ్రిప్ సంపాదించుకోవాలన్నారు. రాష్ట్రంలో పథకాలు అమలు కావడం లేదన్నారని.. అన్నీ చేసి చూపిస్తున్నామని తెలిపారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌లో కుంభకోణం గురించి ప్రజలందరికి తెలుసునని చెప్పారు.
BRS లోకి బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి వెళ్లరు: మంత్రి కోమటిరెడ్డి
మరోవైపు.. మాజీ సీఎం కేసీఆర్‌కు ప్రజలపై ప్రేమ లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి(Minister Komati Reddy Venkata Reddy) విమర్శించారు. ప్రతిపక్ష పాత్ర కీలకమైనదని కేసీఆర్ అసెంబ్లీకి రానప్పుడే ఆ పార్టీపై ఆశలు వదులుకున్నారని అన్నారు. కేసీఆర్ , కేటీఆర్, హరీష్ రావు ముగ్గురు కలసి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఓడించలేకపోయారని.. రేవంత్ రెడ్డికి వాల్లు ఎలా సరిపోతారని ప్రశ్నించారు. SLBC పనులు వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి బీఆర్ఎస్ ఛాంబర్‌కు వెళ్లినంత మాత్రానా ఆ పార్టీలో చేరినట్లా అని ప్రశ్నించారు.
ఈ వార్తలు కూడా చదవండి
Congress MLA'S: కాంగ్రెస్‌లోనే కొనసాగుతాం.. బీఆర్ఎస్‌పై తెల్లం, కాలే యాదయ్య ఫైర్
TS News: నార్సింగీలో బుల్లెట్ బీభత్సం
CM Revanth Reddy: రైతు రుణమాఫీ రెండో విడత నిధులు విడుదల: సీఎం రేవంత్ రెడ్డి
TG Politics: తెలంగాణ రాజకీయాల్లో ఊహించని పరిణామం.. కాంగ్రెస్ నుంచి మళ్లీ బీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే..?
TS News: సాఫ్ట్‌వేర్ యువతిపై సామూహిక అత్యాచారం..
Read Latest Telangana News And Telugu News