Share News

Harish Rao: పేదలపై సీఎం రేవంత్‌ది కపట ప్రేమ.. హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు

ABN , Publish Date - Oct 20 , 2024 | 06:31 PM

మూసీపై సీఎం రేవంత్‌ది గోబెల్స్ ప్రచారమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ కట్టించిన డబల్ బెడ్రూమ్‌లను రేవంత్ రెడ్డి ఇప్పుడు పేదలకు పంచి ఇచ్చి గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఅర్ ఎలాగైతే భూ నిర్వాసితులకు డబల్ బెడ్రూమ్ కట్టి ఇచ్చి నట్లుగా రేవంత్ రెడ్డి కూడా కట్టి ఇవ్వాలని కోరారు.

Harish Rao: పేదలపై సీఎం రేవంత్‌ది కపట ప్రేమ.. హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు

సిద్దిపేట జిల్లా: మల్లన్న, కొండపొచమ్మ సాగర్ నిర్వాసితులపై ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కపట ప్రేమ చూపిస్తున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విమర్శించారు. గజ్వేల్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హరీష్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్‌రావు తీవ్ర విమర్శలు గుప్పించారు.


మల్లన్న సాగర్ , కొండపోచమ్మ నిర్వాసితులకు పాత ఇళ్లకు రూ. 694 కోట్లు, ఇంటి యజమానికి ఉపాధి కింద రూ. 7 లక్షల 50వేలను బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చామని గుర్తు,చేశారు. అన్ని వసతులతో కూడిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చామని స్పష్టంచేశారు. పెళ్లికాని పిల్లలకు 250 గజాల ఖాళీ స్థలం, రూ 5 లక్షలు ఇచ్చామని గుర్తుచేశారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గజ్వేల్ పట్టణ నడిబొడ్డున ఇచ్చామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హైదరాబాద్‌లో మూసీ దగ్గర ఉన్న ఇళ్లను కూల్చివేసిందని అన్నారు. ఆ బాధితులకు మాజీ సీఎం కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రేవంత్ రెడ్డి ఇప్పుడు పేదలకు పంచి గొప్పలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఎలాగైతే భూ నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కట్టి ఇచ్చినట్లుగా రేవంత్ రెడ్డి కూడా కట్టి ఇవ్వాలని హరీష్‌రావు కోరారు.


మూసీ బాధితులకు గచ్చిబౌలిలో 250 గజాల ఇల్లు కట్టి ఇవ్వాలని డిమాండ్ చేశారు. మల్లన్న సాగర్‌లో బాధితులకు కేసీఆర్ అన్యాయం చేసిండా లేక మూసీలో రేవంత్ అన్యాయం చేస్తుండా? అని అడిగారు. కేసీఆర్ ప్రభుత్వంలో 675 ఎకరాల్లో భారత దేశంలో నెంబర్ వన్ ఆర్ అండ్ ఆర్ కాలనీని తమ ప్రభుత్వంలో నిర్మించి ఇచ్చామని అన్నారు. పేదల కోసం కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి ఇస్తే.. ఇప్పుడు మూసీ బాధితులకు ఇచ్చి రేవంత్ డబ్బా కొట్టు కుంటున్నారని విమర్శించారు. మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు డబల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని హరీష్‌రావు మండిపడ్డారు.


గజ్వేల్‌లో 3414 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టి ఇచ్చినట్లు తెలిపారు. గచ్చిబౌలిలో 470 ఎకరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిలో మూసీ బాధితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రేవంత్‌రెడ్డి కట్టి ఇవ్వాలని కోరారు. 8 వేల మంది బాధితులకు 250 గజాల ఇంటి స్థలాలు ఇచ్చి నిర్మాణానికి రూ. 5 లక్షలు ఇచ్చామని వివరించారు. తాము 30 లక్షల ఇళ్లు కట్టి ఇచ్చామని.. మూసీ బాధితులకు రేవంత్ రెడ్డి ఏం ఇచ్చారని ప్రశ్నించారు. ముంపు గ్రామాల బాధితులకు రూ. 2 వేల కోట్లు కేసీఆర్ ఖర్చు పెట్టారని గుర్తు,చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంఅధికారంలోకి వచ్చి ఏడాది అయిన మల్లన్న సాగర్ నిర్వాసితులకు రూపాయి అయిన ఇచ్చారా అని నిలదీశారు. రేవంత్‌వి సొల్లు వాగుడు , అబద్ధాలు , గ్లోబల్స్ ప్రచారమేనని హరీష్‌రావు ఎద్దేవా చేశారు.


తమ ప్రభుత్వంలో తునికి బొల్లారంలో 400 ఎకరాల్లో భూ నిర్వాసితుల కోసం ఇండస్ట్రీయల్ పార్క్ కట్టామని అన్నారు. వర్గల్ మండలంలో పరిశ్రమలు రాకుండా కాంగ్రెస్ నేతలు అడ్డు పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆ రోజు కోర్టుల్లో ఉండి ప్రాజెక్ట్‌లను అడ్డుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడేమో రూపాయి ఇవ్వకుండా కాంగ్రెస్ నేతలు గ్లోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల్లో మిగిలిన వారికి రేవంత్ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Minister Tummala: రైతుబంధు పేరుతో రూ.వేలకోట్ల ప్రజాధనం దోచిపెట్టారు... మంత్రి తుమ్మల ధ్వజం

ABN Effect: ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరస కథనాలతో HMDA అధికారుల్లో కదలిక..

Group-1 Exam: మరోసారి రోడ్డెక్కిన గ్రూప్-1 బాధితులు.. అశోక్‌నగర్‌లో ఉద్రిక్తత..

HYDRA: హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

For Telangana News And Telugu News...

Updated Date - Oct 20 , 2024 | 06:52 PM