HARISH RAO: ఆ బిల్లులు విడుదల చేయాలి... హరీష్‌రావు షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Dec 28 , 2024 | 04:17 PM
HARISH RAO: నవంబర్ వరకు మెస్ ఛార్జీలను వెంటనే రేవంత్ ప్రభుత్వం విడుదల చేయాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతున్నారు..1 తేదీన జీతాలు రావడం లేదు..10 వ తేదీన వస్తున్నాయని హరీష్‌రావు అన్నారు.
సిద్దిపేట జిల్లా: మెస్ చార్జీలు విడుదల చేయడంలో రేవంత్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 నెలల మెస్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని.. వాటిని ఎప్పుడు విడుదల చేస్తారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ మాటలు కోటలు దాటుతున్నావి.. చేతలు గడప దాటడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పిన మాటలకే దిక్కు లేదు..మెస్ చార్జీలు ఇంకా ఎందుకు పెంచడంలేదని ప్రశ్నించారు. విద్యార్థులకు పెంచిన మెస్ చార్జీలను రేవంత్ ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలో విలువ లేదన్నారు. ముఖ్యమంత్రి మాటలు ఉత్తుత్తి మాటలని.. అమలు కావడం లేదని హరీష్‌రావు విమర్శించారు.
సిద్దిపేట నాసర్‌పురాలోని రెసిడెన్షియల్ బ్రిడ్జ్ పాఠశాలలో ఇవాళ(శనివారం) విద్యార్థులకు హరీష్‌రావు దుప్పట్లు పంపిణీ చేశారు. పవనసుత యూత్ సేవా సమితి ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ చేశారు. రాష్ట్రంలో ఉన్న యూత్ , ఎన్. జి.ఓలు ఏదో ఒక స్కూల్‌ను దత్తత తీసుకుని సేవా చేయాలని పిలుపునిచ్చారు. నవంబర్ వరకు రేవంత్ ప్రభుత్వం మెస్ ఛార్జీలు ఇవ్వాలని కోరారు. కాస్మొటిక్ చార్జీలు రూ. 200కు పెంచాలని డిమాండ్ చేశారు. పీఎం అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్‌కు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చిన..రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నిధులు ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు. సీఎం రేవంత్‌రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతున్నారు..1వ తేదీన జీతాలు రావడం లేదు..10వ తేదీన మాత్రమే వస్తున్నాయని అన్నారు. ఉద్యోగులను సెస్పెండ్ చేయడం కాదు..ముఖ్యమంత్రినే సెస్పెండ్ చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలపై రివ్యూ చేసుకోవాలని హరీష్‌రావు హితవు పలికారు.
అంతకుముందు.. సిద్దిపేట అర్బన్ మండలం పొన్నాలలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో వేద భవన్‌లో జరిగిన శ్రీ గోదాదేవి కళ్యాణం, శ్రీ సుదర్శన యాగంలో హరీష్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ రావు మాట్లాడుతూ.. వికాస్ తరంగిణికి ప్రభుత్వం తరుఫున ఎకరం స్థలం ఇచ్చి బిల్డింగ్ నిర్మించింది ఒక సిద్దిపేటలోనే అని తెలిపారు. నిధులు కేటాయించాలంటే రాష్ట్రంలో అధికారంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేతిలో లేకపోవడంతో కొంత ఇబ్బంది అవుతుందన్నారు. త్వరలోనే సిద్దిపేట కోమటి చెరువు వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రూ. 10 కోట్లతో వేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మిస్తామని హరీష్‌రావు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Formula E race: ఫార్ములా ఈ రేసింగ్ కేసులో కీలక పరిణామం
2025 Calendar: 2025 ఏడాదికి సెలవులు ఖరారు
MP Etala: ప్రతి పనిలోనూ విశ్వకర్మలు కీలకం..
Hyderabad: ఓ1 వీసాలతోనూ యూఎస్‌లో ఉండొచ్చు..
Read Latest Telangana News And Telugu News