Share News

Kunamneni Sambasivarao: గులాబీ, కాషాయం పార్టీలను ప్రజలు నమ్మరు

ABN , Publish Date - Jan 20 , 2024 | 09:34 PM

గులాబీ, కాషాయం పార్టీలను ప్రజలు నమ్మరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ( Kunamneni Sambasivarao ) అన్నారు. శనివారం జహీరాబాద్‌లో సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

Kunamneni Sambasivarao: గులాబీ, కాషాయం పార్టీలను ప్రజలు నమ్మరు

సంగారెడ్డి: గులాబీ, కాషాయం పార్టీలను ప్రజలు నమ్మరని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ( Kunamneni Sambasivarao ) అన్నారు. శనివారం జహీరాబాద్‌లో సీపీఐ జిల్లా సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సర్వసభ్య సమావేశానికి కూనంనేని సాంబశివరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ... రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. కమ్యూనిస్టు గరీబోళ్ల పక్షాన లాఠీ దెబ్బలు తింటూ పోరాడే పార్టీ సీపీఐ అని చెప్పారు. ప్రజల పక్షాన పోరాడే కమ్యూనిస్టులను ప్రజలు, మేధావులు సహా కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు. తెలంగాణ సాధన ఉద్దేశం నెరవేర్చేలా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామన్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతూ మోసం చేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హవా కొనసాగిన కమ్యూనిస్టులు కావాలని ప్రజలు కోరుకున్నారని చెప్పారు. పేదల పక్షానా రాజీలేని పోరాటం చేసేది కేవలం ఎర్రజెండాలు మాత్రమేనని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అధికారం కోసం అన్ని పార్టీలతో కలుస్తారని.. కమ్యూనిస్టులు ఎర్రజెండా నీడలోనే కొనసాగుతారని కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.

Updated Date - Jan 20 , 2024 | 10:40 PM