Telangana: విద్య, వైద్యంపైనే మా ఫోకస్.. మంత్రి జూపల్లి కృష్ణారావు

ABN , First Publish Date - 2024-02-10T11:05:12+05:30 IST

రాష్ట్రంలో డ్రగ్స్ ( మత్తు పదార్థాల ) నివారణే ప్రధాన లక్ష్యం అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డ్రగ్స్ సరఫరాపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ గా ఉందన్న ఆయన...

Telangana: విద్య, వైద్యంపైనే మా ఫోకస్.. మంత్రి జూపల్లి కృష్ణారావు

రాష్ట్రంలో డ్రగ్స్ ( మత్తు పదార్థాల ) నివారణే ప్రధాన లక్ష్యం అని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. డ్రగ్స్ సరఫరాపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ గా ఉందన్న ఆయన అసెంబ్లీ సమావేశాల తరువాత డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఇందులో భాగంగా ప్రతి జిల్లాలో పర్యటించి డ్రగ్స్ నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు. డ్రగ్స్ అరికట్టడంలో కీలక నిర్ణయాలు తీసుకుంటామన్నారు. త్వరలోనే పలు బదిలీలు, పదోన్నతులు ఉంటాయని తెలిపారు. విద్య, వైద్యంపై ప్రభుత్వం ప్రధానంగా ఫోకస్ పెడుతోందని చెప్పారు.

కాగా.. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఅర్ పై మంత్రి జూపల్లి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నాటకాలు ఆడటంలో కేసీఆర్‌ను మించిన దిట్ట లేడని మండిపడ్డారు. ఈనెల 13న నల్గొండలో బీఆర్ఎస్ నిర్వహించనున్న సభపై జూపల్లి మండిపడ్డారు. నిలదీయాల్సిన సమయంలో నిలదీయకుండా ఇప్పుడు సభలు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు.

"మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి."

Updated Date - 2024-02-10T11:05:39+05:30 IST