Share News

Election Promises: అక్షింతలు పంచితే చాలనుకున్నారా?: సీతక్క

ABN , Publish Date - Jul 28 , 2024 | 03:16 AM

‘ఎన్నికలకు ముందు అక్షింతలు పంచినం.. ఇక చాలనుకుంటున్నారా? రాష్ట్రానికి విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు అమలు చేయాల్సిన అవసరంలేదా? వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు’ అని బీజేపీ సభ్యులను మంత్రి సీతక్క ప్రశ్నించారు.

Election Promises: అక్షింతలు పంచితే చాలనుకున్నారా?: సీతక్క

హైదరాబాద్‌, జూలై 27 (ఆంధ్రజ్యోతి): ‘ఎన్నికలకు ముందు అక్షింతలు పంచినం.. ఇక చాలనుకుంటున్నారా? రాష్ట్రానికి విభజన చట్టంలో పొందుపరిచిన హామీలు అమలు చేయాల్సిన అవసరంలేదా? వాటి గురించి ఎందుకు మాట్లాడడం లేదు’ అని బీజేపీ సభ్యులను మంత్రి సీతక్క ప్రశ్నించారు. రైతులను ముంచేందుకు నల్ల చట్టాలు తెచ్చారని, కనీస మద్దతు ధరపై చట్టాన్ని ఎందుకు తేవటంలేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని అడిగారు. పదేళ్లలో ధరలు విపరీతంగా పెరిగాయని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి కూడా వృద్ధాప్య పింఛన్లకు రూ.200 చొప్పున మాత్రమే ఇస్తోందన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీల గురించి మాట్లాడాలని బీజేపీ సభ్యులకు సీతక్క సూచించారు.


  • బీఆర్‌ఎస్‌ పాలనలో కార్పొరేషన్‌ చైర్మన్‌కూ ఆసరా పింఛను!

ఉద్యోగిగా పదవీ విరమణ చేసి ప్రభుత్వ పెన్షన్‌ పొందుతున్న వారికీ గత ప్రభుత్వ హయాంలో ఆసరా పింఛను ఇచ్చారని మంత్రి సీతక్క ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఓ కార్పొరేషన్‌ చైర్మన్‌ కూడా ఆసరా పింఛను పొందారని ఆమె చెప్పారు. శనివారం అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ నేత హరీశ్‌రావు పింఛన్ల జాప్యం గురించి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పరిశీలన జరిపి రాష్ట్రవ్యాప్తంగా 5 వేల మంది అనర్హులను గుర్తించిందని తెలిపారు. అనర్హులను గుర్తిస్తున్న నేపథ్యంలోనే కొంత ఆటంకం ఏర్పడిందని ఆమె చెప్పారు.

Updated Date - Jul 28 , 2024 | 03:16 AM