Share News

MLC by-Election: నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక

ABN , Publish Date - May 27 , 2024 | 03:44 AM

ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. సోమవారం జరిగే పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఏనుగుల రాకే్‌షరెడ్డి సహా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.

MLC by-Election: నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక

  • వరకు పోలింగ్‌.. జూన్‌ 5న ఓట్ల లెక్కింపు

  • నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక

  • ఉదయం 8 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్‌

  • ఏర్పాట్లు పూర్తి.. జూన్‌ 5న ఓట్ల లెక్కింపు

హైదరాబాద్‌, మే 26(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. సోమవారం జరిగే పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. కాంగ్రెస్‌ నుంచి తీన్మార్‌ మల్లన్న, బీజేపీ తరఫున గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఏనుగుల రాకే్‌షరెడ్డి సహా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మూడు జిల్లాల పరిధిలోని మొత్తం 4,63,839 మంది పట్టభద్రులు ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 2,88,189, మహిళలు 1,75,645 మంది.


ఉమ్మడి జిల్లాలవారీగా చూస్తే వరంగల్‌లో 1,73,413 మంది (పురుషులు 1,08,349, మహిళలు 65,063), నల్లగొండలో 1,66,448 మంది (పురుషులు 1,06,574, మహిళలు 59,874), ఖమ్మంలో 1,23,985 మంది (పురుషులు 73,266, మహిళలు 50,715) ఓటర్లున్నారు. 605 పోలింగ్‌ స్టేషన్లలో మూడు వేలమందికి పైగా అధికారుల, సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. అత్యధికంగా ఖమ్మం జిల్లాలో 118 కేంద్రాలుండగా అత్యల్పంగా సిద్దిపేట జిల్లాలో 5 బూత్‌లలో పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

Updated Date - May 27 , 2024 | 03:44 AM