Share News

Minister Komatireddy:విద్యా వ్యవస్థలో చాలా మార్పులు.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Sep 05 , 2024 | 09:36 PM

ఉపాధ్యాయులు పట్టుదలతో పని చేస్తే సమాజానికి ఆణిముత్యం లాంటి పౌరులను తయారు చేయొచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. నల్గొండలో గురు పూజోత్సవం కార్యక్రమం జరిగింది.

Minister Komatireddy:విద్యా వ్యవస్థలో చాలా మార్పులు.. మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
Komatireddy Venkat Reddy

నల్గొండ : ఉపాధ్యాయులు పట్టుదలతో పని చేస్తే సమాజానికి ఆణిముత్యం లాంటి పౌరులను తయారు చేయొచ్చని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తెలిపారు. నల్గొండలో గురు పూజోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎంపీలు విజయేంద్ర ప్రసాద్, కుందూరు రఘువీర్ రెడ్డి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల వీరేశం మందుల సామెల్ పాల్గొన్నారు.


ALSO Read: Mobile Recovery: మీ ఫోన్ పోయిందా?.. రికవరీ అయిన మొబైల్స్‌లో ఒకటి మీదేనా?

ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ... ఉపాధ్యాయులు దేవుళ్లుగా మారాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన తనతో సహా ఎంతోమంది ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలిపారు. ఇటీవల ప్రభుత్వ విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయని వివరించారు.


ALSO Read: Uttam kuamr: మరమ్మతులు, పునరుద్ధరణకు టెండర్లను పిలవండి.. మంత్రి ఉత్తమ్ ఆదేశాలు

కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల కంటే ఉపాధ్యాయులే ఎక్కువ అని.. ఇలాంటి పరిస్థితులు మారాలని అన్నారు. రానున్న పదో తరగతి పరీక్షల్లో నల్గొండ జిల్లాను రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉంచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

Harish Rao: విద్యా వ్యవస్థ ఇంకా బలోపేతం కావాలి

Vijayawada Floods: బిగ్ రిలీఫ్.. కోలుకుంటున్న బెజవాడ

Ranganath: హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడితే జైలే గతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 05 , 2024 | 09:41 PM