Share News

Etela Rajender: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత

ABN , Publish Date - Sep 11 , 2024 | 01:58 PM

Telangana: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతతో పాటు సిబ్బంది సమస్యలు బాగా ఉన్నాయని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం నల్గొండ బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఎంపీ మాట్లాడుతూ.. వరుస వర్షాలతో వైరల్ ఫీవర్స్ వ్యాపిస్తున్నాయని.. గ్రామాలకు వైరస్ పాకుతోందన్నారు.

Etela Rajender: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత
MP Etela rajender

నల్గొండ, సెప్టెంబర్ 11: ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరతతో పాటు సిబ్బంది సమస్యలు బాగా ఉన్నాయని ఎంపీ ఈటెల రాజేందర్ (MP Etela rajender) అన్నారు. బుధవారం నల్గొండ బీజేపీ కార్యాలయంలో మీడియాతో ఎంపీ మాట్లాడుతూ.. వరుస వర్షాలతో వైరల్ ఫీవర్స్ వ్యాపిస్తున్నాయని.. గ్రామాలకు వైరస్ పాకుతోందన్నారు. రోగులతో ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిట లాడుతున్నాయన్నారు. నిరంతరాయంగా వైద్య సిబ్బంది పని చేస్తేనే ప్రజల సమస్యలకు పరిష్కారం ఏర్పడుతుందని తెలిపారు.

CM Chandrababu: ప్రజా హితం కోసం యుద్ధం తప్పడం లేదు


డయాగ్నస్టిక్ సెంటర్లలో కిట్స్ కొరత ఉందన్నారు. ప్రభుత్వం ప్రజారోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మెడికల్ కళాశాలల్లో టీచింగ్ స్టాఫ్ పూర్తిగా లేరన్నారు. మెడికల్ కాలేజ్ టీచింగ్ హాస్పిటల్స్‌లో పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు. ప్రజా స్వామ్యంలో కట్టడాలు కూలగొట్టడానికి ఓ పద్ధతి ఉంటుందన్నారు. అన్ని రంగాల్లో ఇచ్చిన హామీలపై అతి తక్కువ కాలంలో విఫలమైన ప్రభుత్వం కాంగ్రెస్ అని విమర్శించారు. కేసీఆర్ అహంకారం గురించి తెలుసుకోవడానికి ఆరేళ్ళు పట్టిందన్నారు. కాంట్రాక్టర్లకు మూడేళ్లుగా బిల్లులు ఇవ్వడం లేదని.... పైరవీలు చేసుకునే పరిస్థితి వచ్చిందని ఎంపీ ఈటెల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి..

HYDRA: ఫుల్ పవర్స్‌తో దూసుకుపోతున్న హైడ్రా

TS News: తెలంగాణ కేబినెట్ విస్తరణకు వెళాయే?

Read LatestTelangana NewsAndTelugu News

Updated Date - Sep 11 , 2024 | 02:20 PM