Medical Colleges: కొత్తగా 17 మెడికల్ పీజీ సీట్లకు అనుమతి
ABN , Publish Date - Aug 03 , 2024 | 05:45 AM
రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా పలు పీజీ కోర్సుల ప్రారంభానికి జాతీయ వైద్య మండలి అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు శుక్రవారం లెటర్ ఆఫ్ పర్మిషన్‌ను ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు పంపింది.
హైదరాబాద్, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నాలుగు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కొత్తగా పలు పీజీ కోర్సుల ప్రారంభానికి జాతీయ వైద్య మండలి అనుమతులు మంజూరు చేసింది. ఈమేరకు శుక్రవారం లెటర్ ఆఫ్ పర్మిషన్‌ను ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్లకు పంపింది. గాంధీ వైద్య కళాశాలలో జీరియాట్రిక్స్ పీజీ కోర్సును మంజూరు చేయగా 4 సీట్లతో ఈ కోర్సు ప్రారంభంకానుంది.
బీఎన్ గంగాధర్ నేతృత్వంలోని ఎన్‌ఎంసీ అప్పీల్ కమిటీ గత నెలలో గాంధీ కాలేజీని పరిశీలించిన అనంతరం ఈ సీట్లను మంజూరు చేసింది. ఇక సిద్దిపేట మెడికల్ కాలేజీకి డెర్మటాలజీ విభాగంలో 3, సూర్యాపేటకు 3 ఈఎన్‌టీ, 4 గైనకాలజీ, నిజామాబాద్‌కు 4 రేడియాలజీ పీజీ సీట్లు మంజూరయ్యాయి.