Share News

BRS Vs Congress: మాల్లారెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ.. కాంగ్రెస్ నేతల ఆగ్రహం

ABN , Publish Date - Aug 30 , 2024 | 12:26 PM

Telangana: మేడ్చల్‌లో అధికార పార్టీ కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారి తీసింది. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిల చేతుల మీదుగా అందజేశారు. చెక్కుల అందజేసి ఎంపీ, ఎమ్మెల్యేలు వెళ్లిపోయాక బీఆర్ఎస్ పార్టీ...

BRS Vs Congress: మాల్లారెడ్డి చేతుల మీదుగా కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ.. కాంగ్రెస్ నేతల ఆగ్రహం
BRS Vs Congress

మేడ్చల్, ఆగస్టు 30: మేడ్చల్‌లో అధికార పార్టీ కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష బీఆర్‌ఎస్ (BRS) కార్యకర్తల మధ్య వాగ్వాదం ఉద్రిక్తతకు దారి తీసింది. మేడ్చల్ మండల పరిషత్ కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులను మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డిల చేతుల మీదుగా అందజేశారు. చెక్కుల అందజేసి ఎంపీ, ఎమ్మెల్యేలు వెళ్లిపోయాక బీఆర్ఎస్ పార్టీ నాయకులతో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాగ్వివాదానికి దిగారు. మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జీ వజ్రేష్ యాదవ్ రాకుండా చెక్కులేలా ఇస్తారని, ఇంకా మీరే అధికారంలో ఉన్నట్లు చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Chandrababu: కాలేజీలో రహస్య కెమెరాల ఘటనపై చంద్రబాబు, లోకేష్ సీరియస్.. విచారణకు ఆదేశాలు


దీనికి జవాబుగా ‘‘మేము ఎందుకు మీకు చెప్పాలి అధికారులు సమాచారం ఇవ్వాలి’’ అంటూ బదులిచ్చారు. ఈ విషయమై మేడ్చల్ డిప్యూటి తహశీల్దార్ సునీల్ కుమార్‌ను కాంగ్రెస్ నాయకులు అడగగా తాము లబ్ధిదారులకు మాత్రమే చెప్పామని బదులిచ్చారు. దీనిపై పలువురు కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి కొన్ని కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కులు అందజేసి వెల్లిపోయారని, మేడ్చల్ నియోజకవర్గానికి ఇంచార్జీగా ఉన్న వజ్రేష్ యాదవ్ రాకముందే చెక్కులెలా ఇస్తారని ప్రశ్నించారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి, మేడ్చల్ జిల్లా ఇంచార్జీ మంత్రి సుదీర్ బాబుకు ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ నేతులు తెలిపారు.


ఈ వార్త కూడా చదవండి...

HYDRA: ఫుల్ పవర్స్‌తో హైడ్రా దూకుడు.. ఆ 52 మంది అధికారులకూ చుక్కలే..

హైదరాబాద్: ఫుల్ పవర్స్‌తో హైడ్రా దూకుడు ప్రదర్శిస్తోంది. కమిషనర్ రంగనాథ్ ఆధ్వర్యంలో 72 బృందాలను ఏర్పాటు చేసింది. ఇవాళ్టి నుంచి అదనంగా హైడ్రాకు సిబ్బంది తోడైంది. ఇకపై నోటీసుల నుంచి కూల్చివేతల వరకూ అన్ని హైడ్రా డైరెక్షన్‌లోనే జరగనున్నాయి. త్వరలోనే హైడ్రా పోలీసు స్టేషన్ ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఇరిగేషన్, మున్సిపల్ శాఖలతో నోటీసులు ఇప్పించడం జరిగింది. ఇకపై హైడ్రా పేరుతోనే నోటీసులు జారీ చేయనున్నారు. కాగా.. ముందుగా చెరువుల్లో నిర్మాణాలకు అనుమతించిన అధికారులపై హైడ్రా స్పెషల్ ఫోకస్ పెట్టింది. వారందరినీ హిట్ లిస్ట్‌లో చేర్చింది. ఇప్పుడు వారందరికీ చుక్కలు చూపించనున్నట్టుగా తెలుస్తోంది.

Kolkata: పిల్లలు లేని ఆమెకు.. మా బాధ ఎలా తెలుస్తుంది.. మమతపై మండిపడిన అభయ తల్లి


చెరువుల్లో నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసిన వారి గుండెల్లో ఇప్పుడు రైళ్లు పరిగెడుతున్నాయి. హైడ్రా మాత్రం చకచకా తన పని తాను చేసుకుంటూ పోతోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్లలో భవనాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై హైడ్రా సీరియస్‌గా ఉంది. ఇప్పటికే 50 మంది అధికారుల చిట్టాను హైడ్రా అధికారులు సిద్ధం చేశారు. 4 చెరువుల్లో నిర్మాణాలకు పర్మిషన్ ఇచ్చిన ఉన్నతాధికారులపై క్రిమినల్ చర్యలకు రంగం సిద్ధం చేశారు. మున్సిపల్ శాఖ, హెచ్ఎండీఏ, సర్వే డిపార్ట్మెంట్లలో పనిచేసిన ఆరుగురు అధికారులపై క్రిమినల్ కేసులు పెట్టేందుకు సైబరాబాద్ కమిషనర్‌కు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సిఫారసు చేశారు. అనుమతుల విషయంలో గతంలో కూకట్ పల్లి, శేరిలింగంపల్లిలో పని చేసిన జోనల్ కమిషనర్ల నుంచి హైడ్రా వివరణ తీసుకుంది. హైడ్రాలిస్టులో పలువురు మున్సిపల్ కమిషనర్లు, జీహెచ్ఎంసీ డీసీలు, టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నట్టు తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి...

Gudlavalleru Engeneering College: ఉధృతంగా విద్యార్థుల ఆందోళన.. ఎస్పీ ప్రకటనపై మిన్నంటిన ఆగ్రహం

Jharkhand: మంత్రిగా రామదాస్ ప్రమాణం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Aug 30 , 2024 | 12:38 PM