Share News

Minister Nimmala: కొంతమంది అధికారుల్లో ఇంకా వైసీపీ ప్రభుత్వ వాసనలు పోలేదు..

ABN , Publish Date - Aug 30 , 2024 | 12:00 PM

గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలు, చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.

Minister Nimmala: కొంతమంది అధికారుల్లో ఇంకా వైసీపీ ప్రభుత్వ వాసనలు పోలేదు..
Minister Nimmala Ramanaidu

అమరావతి: గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే చింతలపూడి ఎత్తిపోతల పథకం ఆగిపోయిందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాలువలు, చింతలపూడి ఎత్తిపోతల పథకాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి వల్లే ప్రాజెక్టులకు గండ్లు పడుతున్నాయని, వాటికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి మంత్రి తెలుసుకున్నారు. వారి హయాంలో ప్రాజెక్టుల నిర్వహణ లోపం స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వ వాసనలు పోని అధికారులపై చర్యలు ఉంటాయని, ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలంటూ మంత్రి సమీక్షలో హెచ్చరించారు.


గత వైసీపీ ప్రభుత్వంలో చింతలపూడి ఎత్తిపోతల పథకం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైనట్లు మంత్రి నిమ్మల చెప్పారు. వరదల సమయంలో 90రోజులపాటు 53టీఎంసీల నీటిని ఎత్తిపోసేలా గత టీడీపీ ప్రభుత్వం ప్రాజెక్టు రూపకల్పన చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లోని 4.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. అలాగే 26లక్షల మందికి తాగునీటి అవసరాలు తీరుతాయని నిమ్మల వెల్లడించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రెండు జిల్లాల్లో మెుత్తం 33మండలాలు, 410గ్రామాలకు లబ్ధి చేకూరుతుందని మంత్రి పేర్కొన్నారు.


ఈ ఏడాది భారీ వర్షాలు కురవడంతో కృష్ణానదికి వరద పోటెత్తినట్లు మంత్రి నిమ్మల చెప్పారు. దీంతో నాగార్జున సాగర్ కుడికాలువ ఆయకట్టు కింద ఖరీప్ సీజన్‌లో పంటలు పండించేందుకు 15రోజుల ముందుగానే సాగునీరు విడుదల చేసినట్లు ఆయన వెల్లడించారు. నాగార్జునసాగర్ ఎడమ కాలువ జోన్-3లో చెరువులు పూర్తిస్థాయిలో నింపి ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా చూడాలని అధికారులను మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి..

Actress Jithwani: ముంబై నటి స్టేట్‌మెంట్ రికార్డు.. కన్నీరు పెట్టుకున్న జిత్వానీ

AP Govt: ఒకే కాంట్రాక్టర్‌కు రూ.64 కోట్ల చెల్లింపులు... ఆర్థిక శాఖలో బయటపడుతున్న వాస్తవాలు

Budda Venkanna: వైసీపీ ప్రభుత్వ అరాచకాలకు నటి జిత్వానీ ఉదంతం ఒక నిదర్శనం

Updated Date - Aug 30 , 2024 | 01:33 PM