Share News

BRS VS Congress వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. మరోసారి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ

ABN , Publish Date - Sep 24 , 2024 | 03:15 PM

వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీల మధ్య మరోసారి ఘర్షణ వాతావరణం నెలకొంది. ఓ కేసుకు సంబంధించి బీఆర్ఎస్‌కు చెందిన యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ ఘటనలో యువకులను పోలీసులు చితకొట్టారని గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం తెలియడంతో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు.

BRS VS Congress  వికారాబాద్ జిల్లాలో ఉద్రిక్తత.. మరోసారి  కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఘర్షణ

వికారాబాద్ జిల్లా: వికారాబాద్ జిల్లా మర్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ఎస్ - కాంగ్రెస్ రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. మర్పల్లి మండలం పట్లూరు గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను ఓ మర్డర్ కేసులో స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులు చితకబాదినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దెబ్బలు తాళలేక పోలీసుస్టేషన్ నుంచి ఓ యువకుడు పారిపోయారు. పోలీసులు కొట్టిన విషయాన్ని యువకుడు గ్రామస్తులకు తెలిపారు.


ALSO READ: KTR: శేరిలింగంపల్లి నియోజకవర్గంపై కేటీఆర్ హాట్ కామెంట్స్

బీఆర్ఎస్‌కు చెందిన యువకులు కావడంతోనే పోలీసులు చితకొట్టారని గ్రామస్తులు ఆరోపించారు. సమాచారం తెలియడంతో వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడు మెతుకు ఆనంద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. పోలీస్ స్టేషన్‌కు మెతుకు ఆనంద్ వెళ్లిన సమయంలో కాంగ్రెస్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ డౌన్ డౌన్ అంటూ బీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేశారు.


ALSO READ: Adi Srinivas: కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకో..సుద్దపూస ముచ్చట్లు ఆపు

మర్డర్ కేసులో అనుమానితులను పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తే కాంగ్రెస్, స్పీకర్‌ను ఎందుకు డౌన్ డౌన్ అంటున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు ప్రశ్నించారు. పోటాపోటీగా ఇరువర్గాలు నినాదాలు చేశాయి. పోలీస్ స్టేషన్ ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల శ్రేణులు ఆందోళనకు దిగాయి. మెతుకు ఆనంద్‌ను పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు బయటకు పంపించి వేశారు. పోలీస్ స్టేషన్ ముందే కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేశాయి. దీంతో పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం.. ఏంటంటే

KTR: శేరిలింగంపల్లి నియోజకవర్గంపై కేటీఆర్ హాట్ కామెంట్స్

V Hanumantha Rao: వైఎస్ జగన్‌కి వీహెచ్ కీలక సూచన

Seethakka: ములుగు మున్సిపాలిటీ బిల్లుకు ఆమోద ముద్ర వేయాలంటూ..

Read Latest Telangana News and Telugu News

Updated Date - Sep 24 , 2024 | 04:46 PM