Share News

Loksabha Polls 2024: ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా మద్యం పట్టివేత.. ఏయే ప్రాంతాల్లో అంటే?

ABN , Publish Date - May 02 , 2024 | 09:43 AM

Telangana: ఎన్నికల వేళ నగరంలో భారీగా మద్యం పట్టుబడింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్‌వోటీ పోలీసుల పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం సరఫరాకు చెక్ పెట్టేందుకు పోలీసులు అన్ని ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిబంధనలు అతిక్రమించి అక్రమంగా తరలిస్తున్న మద్యం పోలీసులకు చిక్కింది. తాజాగా దాదాపు నాలుగు వేల లీటర్ల మద్యాన్ని ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు.

Loksabha Polls 2024: ఎన్నికల వేళ హైదరాబాద్‌లో భారీగా మద్యం పట్టివేత.. ఏయే ప్రాంతాల్లో అంటే?
SOT Police Seized Heavy liquor

హైదరాబాద్, మే 2: ఎన్నికల (Loksabha Elections 2024) వేళ నగరంలో భారీగా మద్యం పట్టుబడింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని ఎస్‌వోటీ పోలీసులు (SOT Police) పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం సరఫరాకు చెక్ పెట్టేందుకు పోలీసులు అన్ని ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటికే నిబంధనలు అతిక్రమించి అక్రమంగా తరలిస్తున్న మద్యం పోలీసులకు చిక్కింది. తాజాగా దాదాపు నాలుగు వేల లీటర్ల మద్యాన్ని ఎస్‌వోటీ పోలీసులు పట్టుకున్నారు.

Loksabha Polls 2024: తెలంగాణలోని 17 పార్లమెంటు స్థానాల పరిధిలో కొత్త సమయం..


సైబరాబాద్ సీపీ నిర్ధిష్టమైన సూచనల మేరకు సైబరాబాద్‌లోని వివిధ ప్రాంతాలలో ఎస్‌వోటీ పోలీసులు, వివిధ పోలీసు స్టేషన్ల సిబందితో కలిసి నిఘా పెట్టారు. ఈ క్రమంలో నిబంధనలు అతిక్రమించి రవాణా అవుతున్న 37 లక్షల విలువగల నాలుగువేల లీటర్స్ మద్యం పోలీసులకు చిక్కింది. మొత్తం మూడు ప్రాంతాల్లో మద్యంతో పాటు నగదును పోలీసులు పట్టుకున్నారు.

TDP: టీడీపీ వర్గీయులపై కత్తులతో దాడి చేసిన వైసీపీ వర్గీయులు


పట్టుబడిన మద్యం వివరాలు..

  • బాచుపల్లి పోలీస్‌స్టేషన్ ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా తరలిస్తున్న రూ.21,53,470 విలువగల 2597.88 లీటర్ల మద్యం పట్టుబడింది. బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • పేట్ బషీరాబాద్ పీఎస్‌ ప్రాంతంలో నిబంధనలకు వ్యతిరేకంగా తరలిస్తున్న రూ.15,46,340 విలువగల 1916.2 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు.

  • ఎస్‌వోటీ బాలానగర్ టీం, కేపీహెచ్‌బీ పోలీసులు రేడియంట్ మనీ లాజిస్టిక్ వాహనంలో నిబంధనలు అతిక్రమించి ఎటువంటి క్యూఆర్‌ కోడ్ లేకుండా తరలిస్తున్న రూ.1,24,626 నగదును పోలీసులు పట్టుకున్నారు.


ఇవి కూడా చదవండి..

AP Elections: తిరగబడుతున్న ఓటర్లు.. ఆ నేతల్లో టెన్షన్..

TDP: టీడీపీ వర్గీయులపై కత్తులతో దాడి చేసిన వైసీపీ వర్గీయులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 02 , 2024 | 10:34 AM