Special trains: కాకినాడ, తిరుపతి మార్గాల్లో ప్రత్యేక రైళ్లు...
ABN , Publish Date - Aug 11 , 2024 | 09:10 AM
వారాంతపు సెలవులు, ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాకినాడ, తిరుప(Kakinada, Tirupati)తి మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే(South Central Railway) తెలిపింది.
సికింద్రాబాద్: వారాంతపు సెలవులు, ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో కాకినాడ, తిరుప(Kakinada, Tirupati)తి మార్గాల్లో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే(South Central Railway) తెలిపింది.
- తిరుపతి-సికింద్రాబాద్(Tirupati-Secunderabad) (07489) స్పెషల్ రైలు ఈనెల 17న సాయంత్రం 5.15గంటలకు తిరుపతి నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 7.25కి సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్-తిరుపతి (07490) రైలు 18న సాయంత్రం 6.10 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.15గంటలకు తిరుపతికి చేరుతుంది.
- కాకినాడ టౌన్- సికింద్రాబాద్ స్పెషల్ (07187) ఈనెల 13, 15వ తేదీల్లో రాత్రి 9.00కి కాకినాడ టౌన్ నుంచి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 8.40కి సికింద్రాబాద్‌కు చేరుతుంది. సికింద్రాబాద్-కాకినాడ టౌన్ స్పెషల్ (07188) సికింద్రాబాద్ నుంచి ఈనెల 14, 16వ తేదీల్లో సాయంత్రం 6.20కి బయల్దేరి మరుసటిరోజు ఉదయం 7.10కి కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
......................................................................
ఈ వార్తను కూడా చదవండి:
..............................................................
Union Minister: ఆదివాసీలు వైదిక ధర్మంలో భాగం..
- గిరిజనుల సంస్కృతి, సనాతన ధర్మం వేర్వేరు కాదు
- కేంద్ర మంత్రి బండి సంజయ్
హైదరాబాద్ సిటీ: ప్రపంచమంతా భారత్ వైపు చూస్తున్న తరుణంలో కొందరు తప్పుడు ప్రచారాలతో సమాజంలో చీలికలు తెచ్చే యత్నం చేస్తున్నారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Home Minister Bandi Sanjay) ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని సంస్థలు అర్థంపర్థం లేని సంస్కృతిని తీసుకొచ్చి సనాతన ధర్నాన్ని అవహేళన చేస్తున్నాయన్నారు. ప్రజ్ఞాభారతి ఆధ్వర్యంలో శనివారం నెక్లె్స్రోడ్లోని జలవిహార్‌లో ‘లోక్ మంథన్ భాగ్యనగర్- 2024’ కర్టెన్‌రైజర్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బ్రోచర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు.
ఆదివాసీలు వైదిక ధర్మంలో భాగమని, గిరిజనుల సంస్కృతి, సనాతన ధర్మం వేర్వేరు కాదన్నారు. ఈ ఏడాది నవంబర్ 21 నుంచి 24 వరకు నగరంలో ‘లోక్ మంథన్ భాగ్యనగర్’ అంతర్జాతీయ సదస్సు జరగనుండటం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. ప్రజ్ఞాభారతి జాతీయ కన్వీనర్ నందకుమార్ మాట్లాడుతూ నవంబర్‌లో జరిగే లోక్ మంథన్ భాగ్యనగర్ అంతర్జాతీయ సదస్సు ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వనవాసీయులు, మైదాన ప్రాంతీయులను ఒకే వేదిక పైకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఆదివాసీ, గిరిజనుల పండుగలు, ఆచారాలను సనాతన ధర్మానికి సంబంధం లేనివిగా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని, వారు చేసే ప్రతీ క్రతువు సనాతన ధర్మానికి అనుగుణంగా సాగేదేనన్నారు. భారత్‌లో గిరిజన జాతి, సనాతన ధర్మం వేర్వేరు కాదంటూ పురాణాల్లోని కొన్ని శ్లోకాలను ప్రఖ్యాత ఆధ్యాత్మిక వేత్త, ప్రవచనకర్త సామవేదం షణ్ముఖశర్మ ఉదహరించారు.
త్రిపురనేని హనుమాన్ చౌదరి మాట్లాడుతూ ఆదివాసీ కళలు, సంస్కృతి, సంప్రదాయాల్లో అణువణువునా వైదిక భావాలుంటాయని పేర్కొన్నారు. నగరవాసులకన్నా గిరిజనులు ఎందులోనూ తక్కువ కాదని, వారి విద్యలు అద్వితీయమని కొనియాడారు. ఈ సందర్భంగా పద్మశ్రీ దాసరి కొండప్ప(Padma Shri Dasari Kondappa)ను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. లోక్ మంథన్ భాగ్యనగర్ సదస్సుకు మొట్టమొదటి ప్రతినిధిగా ఆయన పేరు నమోదు చేశారు. ఈ కార్యక్రమంలో మామిడాల గిరిధర్, ఏపీ మాజీ సీఎ్‌సలు కృష్ణారావు, ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితర ప్రముఖులు పాల్గొన్నారు. కాగా, ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వర్చువల్‌గా మాట్లాడారు.
ఇదికూడా చదవండి: Cyber criminals: నగరంలో.. ఆగని సైబర్ మోసాలు..
ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్ హాస్టల్..
ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్ క్రైంలో కేసు నమోదు..
Read Latest Telangana News and National News