Share News

Warangal: వరంగల్‌లో భగ్గుమన్న కాంగ్రెస్‌ వర్గ విభేదాలు.. పరిస్థితి ఉద్రిక్తం..

ABN , Publish Date - Oct 13 , 2024 | 05:44 PM

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ(Congress Party)లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Konda Surekha), పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి(Revuri Prakash Reddy) వర్గీయుల మధ్య ప్లెక్సీ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.

Warangal: వరంగల్‌లో భగ్గుమన్న కాంగ్రెస్‌ వర్గ విభేదాలు.. పరిస్థితి ఉద్రిక్తం..

వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ(Congress Party)లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ (Konda Surekha), పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి (Revuri Prakash Reddy) వర్గీయుల మధ్య ప్లెక్సీ వివాదం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ధర్మారంలో మంత్రి కొండా వర్గీయులు ఏర్పాటు చేసిన ప్లెక్సీల్లో రేవూరి ఫొటో లేదంటూ ఆయన వర్గీయులు వాటిని చింపివేశారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ అభిమాన నేత మంత్రి కొండా ఫ్లెక్సీలు చింపివేయడంపై ఆమె అభిమానులు పెద్దఎత్తున నిరసన చేపట్టారు. భారీగా చేరుకున్న నేతలు, కార్యకర్తలంతా వరంగల్- నర్సంపేట ప్రధాన రహదారి ధర్మారం వద్ద రాస్తారోకో నిర్వహించారు.


రేవూరి ప్రకాశ్ రెడ్డికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఎమ్మెల్యే రేవూరి తమపై అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారంటూ ఆందోళనకు దిగారు. కొండా వర్గీయుల ధర్నాతో వరంగల్- నర్సంపేట రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఒక్కసారిగా ఉమ్మడి జిల్లా రాజకీయాలు వేడెక్కాయి. ఉద్రిక్తతల నేపథ్యంలో గీసుగొండ పోలీస్ స్టేషన్‌కు మంత్రి కొండా, సీపీ అంబర్ కిషోర్ ఝా చేరుకున్నారు. తమ వర్గీయులపై కేసుకు సంబంధించిన వివరాలను సీపీని అడిగి మంత్రి కొండా సురేఖ వివరాలు తెలుసుకున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి:

Pro Saibaba: సాయిబాబా భౌతిక కాయాన్ని ఆసుపత్రికి అప్పగిస్తాం.. కుటుంబ సభ్యుల ప్రకటన

Mallu Ravi: సీఎం రేవంత్ రెడ్డి నిశ్శబ్ద విప్లవ నాయకుడు: ఎంపీ మల్లు రవి..

Alai Balai: తెలంగాణ ఉద్యమంలో అందరినీ కలిపిన ‘అలయ్ బలయ్’

Nara Rohit: నటి సిరితో నారా రోహిత్ ఎంగేజ్ మెంట్..

Updated Date - Oct 13 , 2024 | 06:52 PM