Kadiam Srihari: బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధిస్తుంది
ABN , Publish Date - Feb 25 , 2024 | 10:51 PM
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari) అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...30 ఏళ్ల నాటి కాంగ్రెస్ కిరాతక చర్యలు.. రెండు నెలల్లోపే పురుడు పోసుకున్నాయని మండిపడ్డారు.
హనుమకొండ: బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే కడియం శ్రీహరి(Kadiam Srihari) అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ...30 ఏళ్ల నాటి కాంగ్రెస్ కిరాతక చర్యలు.. రెండు నెలల్లోపే పురుడు పోసుకున్నాయని మండిపడ్డారు. అగరంపహాడ్ జాతరలో జైచల్లా ధర్మారెడ్డి అని నినాదాలు చేసిన వారిపై పోలీసులు దాష్టీకంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ కార్యకర్తలను టాస్క్ ఫోర్స్ పోలీసులు రాత్రికి రాత్రే తీసుకెళ్లి ఇష్టం వచ్చినట్లు కొట్టారని మండిపడ్డారు. పోలీసులు కొట్టడంతో బీఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయని చెప్పారు. 12మంది తమ పార్టీకి చెందిన కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని అన్నారు. 12మంది బీఆర్ఎస్ కార్యకర్తలను చిత్ర హింసలకు గురి చేసిన ఆత్మకూరు ఎస్ఐని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. 24 గంటల్లో పోలీసుల నుంచి సరైన స్పందన లేకపోతే 27వ తేదీన ఛలో ఆత్మకూరు చేపడతామని కడియం శ్రీహరి హెచ్చరించారు.