Share News

TG Politics: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సెంటిమెంట్ కలిసొచ్చేనా..?

ABN , Publish Date - Apr 06 , 2024 | 06:48 PM

కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సెంటిమెంట్ కలిసి వస్తోందా..? ఈసారైనా ఆ పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుందా..? అంటే ఔననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడ నుంచి సమరశంఖం పూరించారు. అక్కడి నుంచే ప్రచారం స్టార్ట్ చేశారు. ఆరు గ్యారంటీలను ప్రకటించారు. గ్యారంటీలు జనాలను ఆకర్షించాయి. మళ్లీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల వేళ తుక్కుగూడ నుంచి జన జాతర బహిరంగ సభ చేపట్టింది.

TG Politics: కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ సెంటిమెంట్ కలిసొచ్చేనా..?
Will Telangana Sentiment Workout To The Congress party

హైదరాబాద్: కాంగ్రెస్ (Congress) పార్టీకి తెలంగాణ సెంటిమెంట్ కలిసి వస్తోందా..? ఈసారైనా ఆ పార్టీ కేంద్రంలో అధికారం చేపడుతుందా..? అంటే ఔననే అంటున్నారు కాంగ్రెస్ నేతలు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తుక్కుగూడ నుంచి సమరశంఖం పూరించారు. అక్కడి నుంచే ప్రచారం స్టార్ట్ చేశారు. ఆరు గ్యారంటీలను ప్రకటించారు. గ్యారంటీలు జనాలను ఆకర్షించాయి. మళ్లీ ఇప్పుడు లోక్ సభ ఎన్నికల (Loksabha Polls) వేళ తుక్కుగూడ నుంచి జన జాతర బహిరంగ సభ చేపట్టింది. సభ వేదిక నుంచి కాంగ్రెస్ (Congress) పార్టీ జాతీయ మేనిఫెస్టో రిలీజ్ చేస్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచి ఆరు గ్యారంటీలు ప్రకటించడం, అధికారం చేపట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా అదే సీన్ రిపీట్ అవుతోందని ఆశిస్తున్నారు.


ప్రభ కోల్పోయిన కాంగ్రెస్..?

కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమై పదేళ్లు అవుతోంది. ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభ కోల్పోయింది. తెలంగాణ, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ తప్ప మిగతా రాష్ట్రాల్లో అధికారం లేని పరిస్థితి. 2014తో పోల్చితే 2019లో కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సీట్లు గణనీయంగా తగ్గిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అనారోగ్యంతో పార్టీ ప్రతిపక్షానికే పరిమితం కావాల్సి వచ్చింది. రాహుల్ గాంధీ జనాల్లోకి వెళుతున్న జనం నాడీ ఇంక పట్టలేదని విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. దాంతో కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ తగ్గుతూ వస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఆరు గ్యారంటీలు ప్రజలను అమితంగా ఆకర్షించాయని ఆనలిస్టులు చెబుతున్నారు. దానికితోడు బీఆర్ఎస్ పార్టీ సిట్టింగులపై వ్యతిరేకత కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒకేసారి 105 మంది అభ్యర్థులను ప్రకటించడం 2023లో కేసీఆర్‌కు కలిసి రాలేదు.


ఇవి కూడా చదవండి:

TG Politics: 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రెడీ.. మంత్రి ఉత్తమ్ సంచలన వ్యాఖ్యలు

West Bengal: దీదీతో గొడవకు కారణం ఆ మంత్రే.. బెంగాల్ గవర్నర్ సంచలనం

Maharashtra: కల్యాణ్ నియోజకవర్గం నుంచి మళ్లీ బరిలోకి షిండే కుమారుడు..? ఫడ్నవీస్ ఏమన్నారంటే..?

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Apr 06 , 2024 | 06:56 PM