TG Politics: వారితోనే ఫోన్ ట్యాపింగ్.. కాంగ్రెస్ నేత సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 02 , 2024 | 08:13 PM
బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ మాటలు గత రాజరిక దర్బార్‌ను తలపిస్తున్నాయని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆ దర్బార్ మాటలు విని విని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టిన వీరికి సిగ్గు రావడం లేదని చెప్పారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ మాటలు గత రాజరిక దర్బార్‌ను తలపిస్తున్నాయని మహబూబ్‌నగర్ కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. మంగళవారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఆ దర్బార్ మాటలు విని విని తెలంగాణ ప్రజలు బండకేసి కొట్టిన వీరికి సిగ్గు రావడం లేదన్నారు. పోలీస్‌ల రూపంలో ప్రైవేట్ సైన్యాన్ని కేసీఆర్ పెంచి పోషించారని చెప్పారు. ఆ సైన్యంతోనే ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) చేయించారని మండిపడ్డారు.
CM Revanth Reddy: లోక్‌సభ ఎన్నికల్లో కుట్రకు తెరదీసిన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు
ఆ సైన్యమే పలు విషయాలను బయట పెడుతున్నా కేటీఆర్ ఇంకా ఊక దంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. ఫోన్ ట్యాపింగ్ వల్ల సభ్య సమాజం సిగ్గు పడుతోందన్నారు. లీగల్ నోటీసులు ఇస్తానని ట్విట్టర్ పిట్ట కేటీఆర్ చెబుతున్నారని అన్నారు. తాము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు కేటీఆర్ ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. కేటీఆర్‌కు తెలంగాణ ఉద్యమం గురించి తెలుసా? అని నిలదీశారు.
Harish Rao: దొంగలు పడ్డ ఆర్నెళ్లకు కుక్కలు మొరిగినట్టుగా సర్కారు తీరు..
తెలంగాణ ఉద్యమకంటే ముందు మీ ఆస్తులు ఎన్ని ప్రస్తుత ఆస్తులు ఎన్ని? కేటీఆర్ లీగల్‌గా ఫైట్ చేద్దామా? అని సవాల్ విసిరారు. అమెరికా నుంచి ఇండియకొచ్చినప్పుడు కేటీఆర్ ఆస్తులు ఎన్ని..? తన సవాల్‌ని స్వీకరిస్తావా చర్చకు సిద్ధమా అని అడిగారు. టెలిగ్రాఫ్ ఆక్ట్ ప్రకారం ట్యాపింగ్ చేయడం దేశ ద్రోహమన్నారు. ఆయన ప్రవర్తనల వల్ల రాష్ట్ర పరువు పోయిందని ఎద్దేవా చేశారు. పరువు నష్ట దావా వేసే నైతిక హక్కు కేటీఆర్‌కు లేదని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు.
Kadiyam Srihari: బీజేపీ ఆకృత్యాలను అడ్డుకోవడం ప్రాంతీయ పార్టీల వల్ల కాదు: కడియం శ్రీహరి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి