TG Politics: కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించడంపై కాంగ్రెస్ నేత కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Apr 04 , 2024 | 10:15 PM
మాజీ మంత్రి కేటీఆర్ (KTR) లీగల్ నోటీసులు పంపి బెదిరించాలని చూస్తున్నారని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. కేటీఆర్ తనతో పాటు మరో ఇద్దరికి లీగల్ నోటీసులు పంపించారని చెప్పారు. అసలు ఆయనకు లా అడ్మినిస్ట్రేషన్ పై అవగాహన ఉందా అని ప్రశ్నించారు.
హైదరాబాద్: మాజీ మంత్రి కేటీఆర్ (KTR) లీగల్ నోటీసులు పంపి బెదిరించాలని చూస్తున్నారని కాంగ్రెస్ (Congress) ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (Yennam Srinivas Reddy) అన్నారు. కేటీఆర్ తనతో పాటు మరో ఇద్దరికి లీగల్ నోటీసులు పంపించారని చెప్పారు. అసలు ఆయనకు లా అడ్మినిస్ట్రేషన్ పై అవగాహన ఉందా అని ప్రశ్నించారు. గురువారం నాడు గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్‌పై వరుస కథనాలు వస్తున్నాయన్నారు. తన ఫోన్ ట్యాప్ అయినట్లు డీజీపీకి ఫిర్యాదు చేశానని చెప్పారు. ఇన్వెస్టిగేషన్ జర్నలిజం గురించి కేటీఆర్‌కు ఏం తెలుసు.. బ్లాక్ మెయిల్ బెదిరింపులు తప్పా అని ప్రశ్నించారు. తమకు లీగల్ నోటీసులు ఇవ్వడానికి ఆస్కారం ఏముందన్నారు. విచారణ జరుగుతున్నప్పుడు లీగల్ నోటీసులు ఇస్తారా అని ప్రశ్నించారు. ఫామ్ హౌస్‌లో ఒకరు, గెస్ట్ హౌస్‌లో ఇంకొకరు ఉండి పాలన సాగించారని మండిపడ్డారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు... సంచలన విషయాలు వెలుగులోకి..!
పోలీస్ ఆఫీసర్లను ఊరుకనే జైల్లో ఎందుకు పెడతారని ఫోన్ ట్యాపింగ్‌పై ఆధారాలు ఉన్నాయని అందుకనే తప్పు చేసిన అధికారులను జైలుకు పంపించారని చెప్పారు. కేటీఆర్ ప్లేస్ లో తానుంటే డీజీపీకి లేఖరాసే వాడినని. నిక్ష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని కోరేవాడినని చెప్పారు. టాస్క్ ఫోర్స్ వాహనాల్లో డబ్బులను తరలించినట్లు వార్తలు కూడా వచ్చాయన్నారు. మేనేజ్ మెంట్ కోటాలో వచ్చిన కేటీఆర్‌కు ఈ విషయం గురించి ఏం తెలుసునని ప్రశ్నించారు. అధికార దుర్వినియోగం చేసినందుకు 39 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను డిస్ క్వాలిఫై చేయాలని కోరారు.
KTR: నేతన్నలపై కాంగ్రెస్‌కు ఎందుకింత కక్ష..?: కేటీఆర్
సీఎం రేవంత్ రెడ్డిపై ఢిల్లీకి కప్పం కడుతున్నారని ఆరోపణలు చేసినందుకు లీగల్ నోటీసులు కేటీఆర్‌కు ఇవ్వాలన్నారు. ఇతర పార్టీ నేతల ఫోన్లు ట్యాపింగ్ చేయడమే కాదని.. సొంత ఇంటి వాళ్ల ఫోన్లు ట్యాపింగ్ చేయలేదా అని ప్రశ్నించారు. ఈ విషయంలో కూడా నోటీసులు ఇస్తే ఇచ్చేయాలన్నారు. ఫోన్ ట్యాపింగ్ అనేది సమాజ వ్యతిరేక శక్తులపై చేస్తారని కానీ రాజకీయ నేతల ఫోన్లపై చేస్తారా అని ప్రశ్నించారు. హైకోర్టు జడ్జీల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి దాని సంగతి ఏంటని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి నిలదీశారు.
BRS: బీఆర్ఎస్‌ను దెబ్బేసింది ఇదే.. 'సారు'కు తెలిసొచ్చింది!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి