Shamshabad Airport: శంషాబాద్‌లో రూ. 13 కోట్లు విలువైన డ్రగ్స్ పట్టివేత..!
ABN, Publish Date - Nov 01 , 2024 | 03:54 PM
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు ఇవాళ(శుక్రవారం) తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. వీటి విలువ సుమారుగా రూ. 13 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులు ఇవాళ(శుక్రవారం) తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. వీటి విలువ సుమారుగా రూ. 13 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న హైడ్రోపోనిక్ గంజాయిని పట్టుకున్నట్లు వెల్లడించారు. తినే పదార్థం కేలోక్స్‌లో హైడ్రోపోనిక్ గంజాయిని తీసుకువస్తున్నట్లు గుర్తించామని అన్నారు. గంజాయి తీసుకువస్తున్న నిందితుడిని అరెస్ట్ చేశారు. 13 ప్యాకెట్లలో హైడ్రోపోనిక్ గంజాయి రవాణా చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అత్యంత విలువైన ఖరీదైన హైడ్రోపోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నామని అన్నారు.. హైడ్రోపోనిక్ గంజాయి అత్యంత ఖరీదైనదని తెలిపారు. ఈ డ్రగ్స్ ప్రమాదకరమైనదని అన్నారు. హైడ్రోపోనిక్ గంజాయి తయారు చేయడానికి సంవత్సరం సమయం పడుతుందని తెలిపారు.వాటర్ కంటెంట్ లేకుండా చేయడానికి సంవత్సరం సమయం పడుతుందని చెప్పారు. హైడ్రోపోనిక్ గంజాయిని నీళ్లలో కలుపుకుని తాగవచ్చని అన్నారు.
ప్రపంచంలోని కొన్ని దేశాల్లో మాత్రమే ఇది తయారవుతుందని స్పష్టం చేశారు. పట్టుబడ్డ హైడ్రోపోనిక్ గంజాయి కోట్ల రూపాయల విలువ ఉంటుందని డీఆర్ఐ అధికారులు చెబుతున్నారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న ఇద్దరు భారతీయ ప్రయాణికుల వద్ద నుంచి ఈ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నామని డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. ఇద్దరిపై ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Updated at - Nov 01 , 2024 | 03:57 PM