Share News

Tirumala Temple: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం

ABN , Publish Date - Mar 17 , 2025 | 04:33 PM

Tirumala Temple Security: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బట్టబయలైంది. తిరుమలలో ధర్నాలు, ఆందోళనలు నిషేధం అయ్యినప్పటికీ ఏకంగా ఆలయం వద్దే కొంతమంది ఆందోళనకు దిగారు. ఈ ఘటనతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tirumala Temple: తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం
Tirumala Temple Security Failure

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో భద్రతా వైఫల్యం మరోసారి బయటపడింది. ఇటీవల కాలంలో కొంతమంది భక్తులు మొబైల్‌తో ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించారని, అలాగే ఆలయ మాడవీధుల్లో సీఎంవో వాహనం ప్రవేశించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. టీటీడీ భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఏపీ సాధు హిందూ పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసనందా, బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ శ్రీవారి ఆలయం వద్ద ఆందోళనకు దిగారు.


ఆలయానికి సమీపంలోనే దాదాపు 40 మంది ఆందోళనకు దిగిన ఆలయ భద్రతా సిబ్బంది కట్టడి చేయలేక పొయారు. అరగంట పాటు ఆలయం వద్ద నినాదాలతో కార్యకర్తలు ఆందోళన చేశారు. ఆలయం వద్ద ఏదో జరుగుతుందని భక్తులు భయాందోళనకు గురయ్యారు. దాదాపు 30నిమిషాల అనంతరం శ్రీనివాసానందా, రామచంద్ర యాదవ్‌ని అదుపులోకి తీసుకొని తిరుపతికి పోలీసులు తరలించారు. అయితే వరుస ఘటనలతో టీటీడీలో కలవరం మొదలైంది. టీటీడీ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటివి చోటుచేసుకుంటున్నాయని భక్తులు మండిపడుతున్నారు.


తిరుమలలో ధర్నాలు,నిరసనలు నిషిద్ధం: తిరుమల డీఎస్పీ విజయ్ శేఖర్

తిరుమలలో ధర్నాలు, నిరసనలు చేయడం నిషిద్ధమని తిరుమల డీఎస్పీ విజయ్ శేఖర్ తెలిపారు. తిరుమలలో తాము నిరసన చేయమని శ్రీనివాసానంద, రామచంద్ర యాదవ్ ముందుగానే తమకు చెప్పారని అన్నారు. తిరుపతిలోనే వీరికి నోటీసులు జారీ చేశామని తెలిపారు. టీటీడీ నిబంధనలు ఉల్లంఘించి ఆలయం వద్ద వీరు నిరసనకు దిగారని చెప్పారు. నిరసనకారులను అరెస్ట్ చేసి తిరుపతికీ తరలించామని అన్నారు. ఆలయం వద్ద ఆందోళన చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ విజయ్ శేఖర్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

TTD decision: వారికి గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ.. ఇకపై

Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు

Cooperative banks corruption: సహకార బ్యాంకుల్లో అవినీతిపై అచ్చెన్న సమాధానం ఇదీ..

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 17 , 2025 | 05:34 PM