Share News

Pawan kalyan: పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు

ABN , Publish Date - Mar 27 , 2025 | 08:06 PM

Pawan kalyan: పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి వారం సమీక్ష చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు.

Pawan kalyan: పిఠాపురం అభివృద్ధిలో మరో ముందడుగు
Pawan kalyan

అమరావతి: పిఠాపురం అభివృద్ధిపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగానే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పర్యటించారు. పిఠాపురం అభివృద్ధి పనులపై ఇవాళ(గురువారం) అధికారులతో పవన్ కల్యాణ్ సమీక్ష సమావేశం నిర్వహించారు.


ఈ సందర్భంగా అధికారులకు పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రతి వారం సమీక్ష చేపట్టాలి... క్షేత్ర స్థాయిలో పురోగతిని పరిశీలించాలని అన్నారు. మౌలిక వసతుల కల్పన విషయంలో చురుగ్గా వ్యవహారించాలని ఆదేశించారు. నియోజకవర్గం అభివృద్ధికి వివిధ పథకాల ద్వారా నిధులు సమకూరుస్తున్నామని స్పష్టం చేశారు. వాటిని సద్వినియోగం చేసి ప్రజలకు మేలు చేసే బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. శాంతిభద్రతల అంశంపై సంబంధిత విభాగం ఉన్నతాధికారులు, రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళ్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

Jayamangala చంద్రబాబు కాళ్ల మీద పడ్డ వైపీసీ మాజీ నేత

CM Chandrababu: పోలవరం ప్రాజెక్టు సందర్శనకు..

Local Body Elections: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు.. పలు చోట్ల ఉద్రిక్తత

For More AP News and Telugu News

Updated Date - Mar 27 , 2025 | 08:09 PM