Share News

AP GOVT: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు

ABN , Publish Date - Jan 03 , 2025 | 07:30 PM

Andhra pradesh Government: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇంగ్లీషులోనూ తెలుగులోనూ జీఓ ఏం ఎస్ నెంబర్ 3ను సాధారణ పరిపాలన శాఖ జారీ చేసింది. ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం పేర్కొంది.

AP GOVT: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. ఇకపై తెలుగులోనూ ప్రభుత్వ ఉత్తర్వులు
Andhra pradesh Government

అమరావతి: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉత్తర్వులను తెలుగులోనూ ఇవ్వాలని నిర్ణయించింది ఈ మేరకు ఇంగ్లీషు, తెలుగులోనూ జీఓ ఏంఎస్ నెంబర్ 3ను సాధారణ పరిపాలన శాఖ జారీ చేసింది. ప్రభుత్వ పనితీరులో ఉత్తర్వులు కీలక పాత్ర పోషిస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 90 శాతం మంది తెలుగు మాట్లాడే ప్రజలు ఉన్న రాష్ట్రంలో తెలుగులో ఉత్తర్వులు జారీ చేయడం సహేతుకమని ప్రభుత్వం పేర్కొంది. మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏపీలో తెలుగు భాషా సమగ్రతకు ఇలా ఉత్తర్వులు జారీ చేయడం తోడ్పడుతుందని పేర్కొంది.


ఆంగ్లం, తెలుగు రెండు భాషల్లోనూ ఉత్తర్వులు జారీ చేయాలని వివిధ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. మొదట ఆంగ్లంలో ఉత్తర్వులు జారీ చేసి రెండు రోజుల్లో తెలుగులో అప్లోడ్ లేదా మొదట తెలుగులో జారీ చేసి రెండు రోజుల్లో ఆంగ్లం లేదా రెండు భాషల్లో ఏక సమయంలో ఉత్తర్వులు ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది. ఆంగ్లంతో పాటూ తెలుగులోనూ అదే ఉత్తర్వులు జారీ అయ్యేలా చర్యలు చేపట్టాలని వివిధ శాఖలకు సాధారణ పరిపాలన శాఖ సూచనలు ఇచ్చింది. ప్రభుత్వ ఉత్తర్వులు తెలుగులో అనువదించడానికి డైరెక్టర్ ఆఫ్ ట్రాన్స్‌లేషన్ సేవలను వినియోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. ఈమేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

AP Govt: ఏపీ మేకర్ ల్యాబ్ ఆన్ వీల్స్.. లక్ష్యం ఇదే

DK Aruna: సీఎం చంద్రబాబుపై డీకే అరుణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Atchannaidu: జగన్‌వి అన్నీ ప్రగల్భాలే.. రాష్ట్రాన్ని భష్టు పట్టించారు.. అచ్చెన్న ఫైర్

Read Latest AP News And Telugu news

Updated Date - Jan 03 , 2025 | 08:04 PM