AP DGP: సంతృప్తితో వెళ్తున్నా.. ఏపీ డీజీపీ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 30 , 2025 | 06:07 PM
AP DGP Dwaraka Tirumala Rao: ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నేరాల రేటు తగ్గిందని ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు తెలిపారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు 9.5 శాతం తగ్గాయని అన్నారు. రోడ్డు సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయని డీజీపీ ద్వారక తిరుమల రావు చెప్పారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయని ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు తెలిపారు. ఏడు నెలలుగా ఏపీ డీజీపీగా పని చేస్తున్నానని.. 35 ఏళ్లుగా పోలీస్ సేవలు సంతృప్తికరంగా అందించాను అనే తృప్తి తనకు ఉందని చెప్పారు. ఇవాళ(గురువారం) డీజీపీ కార్యాలయంలో ఏపీ డీజీపీ ద్వారక తిరుమలరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. తాను సంతృప్తికరంగా సర్వీసును ముగిస్తున్నానని అన్నారు. సైబర్ క్రైమ్ తప్ప మిగతా వాటిలో నిందితులను గుర్తిస్తున్నామని అన్నారు సైబర్ క్రైమ్ తప్ప అన్నీ కంట్రోల్‌లో ఉన్నాయని చెప్పారు.
వరదల సమయంలో కూడా పోలీసులు మెరుగైన సేవలు అందించారని గుర్తుచేశారు. టెక్నాలజీని అందిపుచ్చుకుని ముందుకు వెళ్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల నేరాల రేటు తగ్గిందని చెప్పారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలు 9.5 శాతం తగ్గాయన్నారు. రోడ్డు సేఫ్టీపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయన్నారు. సీసీ కెమెరాలను ప్రజల భాగస్వామ్యంతో కలిసి ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు 25 వేల కెమెరాలు ఏర్పాటు చేశామని చెప్పుకొచ్చారు. మార్చి 31వ తేదీ నాటికి లక్ష కెమెరాలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. డ్రోన్స్‌ను కూడా దాతల సాయంతో అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి తెచ్చే యత్నం చేస్తున్నామని చెప్పారు. ఏపీ, తెలంగాణలో ఉన్న ఫింగర్ ప్రింట్ వ్యవస్థ ముందుందని ఏపీ డీజీపీ ద్వారక తిరుమల రావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
Investments in AP: ఏపీలో భారీ పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్.. అత్యధికం ఎక్కడంటే
Maha Kumbh Mela: మీ ఊరి నుంచే కుంభమేళాకు బస్సు.. భక్తుల కోసం బంపర్ ఆఫర్
Tribute.. జాతిపిత మహాత్మాగాంధీకి సీఎం చంద్రబాబు నివాళులు
AP News: ఏపీలో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణ
Read Latest AP News And Telugu News