Share News

Satya Kumar Yadav: ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు

ABN , Publish Date - Mar 28 , 2025 | 09:11 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.259 కోట్లు అద‌న‌పు కేంద్ర నిధులను మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు. ఏపీ అభివృద్ధికి కావాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు.

Satya Kumar Yadav: ఏపీ అభివృద్ధికి సరికొత్త ప్రణాళికలు
Minister Satya Kumar Yadav

అమరావతి: ఏపీ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సరికొత్త ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగానే వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ఏపీ డైవలప్‌మెంట్‌కు కావాల్సిన నిధులపై ఆయా రంగాల కేంద్రమంత్రులతో చర్చిస్తున్నారు. ఈ మేరకు మంత్రి సత్యకుమార్ ఇవాళ (శుక్రవారం) కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్‌‌తో న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు. జాతీయ ఆరోగ్య మిష‌న్(NHM), ఇత‌ర ప‌థ‌కాల కింద రాష్ట్రానికి అద‌నంగా రూ.259 కోట్లు కేటాయించాల‌ని మంత్రి సత్యకుమార్ కోరారు. ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం ముగియ‌నున్నందున కేంద్ర ప్ర‌భుత్వం పలు ప‌థ‌కాల కింద పునఃకేటాయింపులు చేస్తుందని మంత్రి సత్యకుమార్ అన్నారు.


కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రూ.800 కోట్ల మేర‌కు పునఃకేటాయింపుల కింద అద‌న‌పు నిధులను కేటాయిస్తోంది. వీటిలో ఎన్‌హెచ్ఎం కింద ఏపీకి రూ.109 కోట్లు విడుద‌ల చేయాల‌ని కేంద్ర వైద్య‌, ఆర్థిక శాఖా మంత్రులను మంత్రి సత్యకుమార్ విన్నవించారు. ఫర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కింద రాష్ట్రానికి మ‌రో రూ.150 కోట్లు విడుద‌ల చేయాల‌ని మంత్రి సత్యకుమార్ అడిగారు. కేంద్ర టూరిజం, న్యాయ‌, అణుశ‌క్తి శాఖా మంత్రుల‌తో కూడా మంత్రి స‌త్య‌కుమార్ స‌మావేశ‌మయ్యారు. రాష్ట్రానికి చెందిన ప‌లు విష‌యాల‌పై మంత్రి సత్యకుమార్ చ‌ర్చించారు. రాష్ట్రంలో ప‌ర్యాట‌కాభివృద్ధి, క్యాన్స‌ర్ చికిత్స‌ల విష‌యంలో అద‌న‌పు కేంద్ర సాయాన్ని మంత్రి సత్యకుమార్ కోరారు


ఈ వార్తలు కూడా చదవండి..

Lokesh Congratulates Akhil: 11ఏళ్ల టెక్‌ పిడుగు అఖిల్‌కు మంత్రి లోకేష్ అభినందనలు

Vamsi Bail Petition: వరుస ఎదురుదెబ్బలతో వంశీ ఉక్కిరిబిక్కిరి

Read Latest AP News And Telugu News

Updated Date - Mar 28 , 2025 | 09:23 PM