Share News

Group 2 Mains: రేపటి గ్రూప్2 పరీక్ష వాయిదా.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

ABN , Publish Date - Feb 22 , 2025 | 02:29 PM

Group 2 Mains Exam: ఈ నెల 23న జరగాల్సిన గ్రూప్స్ 2 మెయిన్స్ పరీక్షను ఏపీపీఎస్సీ కొద్దిరోజుల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంతో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది.

Group 2 Mains: రేపటి గ్రూప్2 పరీక్ష వాయిదా.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం
Group 2 Mains Exam

అమరావతి: గ్రూప్స్ 2 మెయిన్ పరీక్షలపై ఏపీపీఎస్సీ కీలక ప్రకటన చేసింది. రేపు (23వ తేదీ) నిర్వహించాల్సిన పరీక్షను కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రోస్టర్ తప్పులను సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం రోస్టర్ అంశంపై ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. వచ్చే నెల 11వ తేదీన మరోమారు ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ చేపట్టనుంది. హై కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.


అభ్యర్థుల ఆందోళన..

కాగా, గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని, రోస్టర్‌ విధానంలో మార్పులు చేయాలంటూ అభ్యర్థులు కొద్దిరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ విషయంపై అభ్యర్థులు హైకోర్టుకు వెళ్లగా.. పరీక్షలను నిలిపి వేయడాన్ని నిరాకరిస్తూ సింగిల్‌ జడ్జి ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గ్రూప్‌-2 అభ్యర్థులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. విశాఖపట్నం, హైదరాబాద్ సహా వివిధ ప్రాంతాల్లో రోడ్డెక్కి ఆందోళనలు చేశారు. 2023 డిసెంబరు 7వ తేదీన ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ సుప్రీంకోర్టు తీర్పు, ఏపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో 77కి విరుద్ధంగా ఉందని, ఈ విషయాన్ని సింగిల్‌ జడ్జి విస్మరించారని తెలిపారు.


హైకోర్టును ఆశ్రయించిన అభ్యర్థులు..

సింగిల్‌ జడ్జి ఉత్తర్వులపై స్టే విధించి, 23న జరగనున్న గ్రూపు-2 మెయిన్స్‌ పరీక్షను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును ఆశ్రయించారు. అయితే గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్ష అనంతరం అభ్యర్థుల నుంచి మరోసారి పోస్టుల ప్రాధాన్యతలు తీసుకుంటారని ఏపీపీఎస్సీ తెలిపింది. ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితా రూపొందించే ముందు దీనికి సంబంధించిన ప్రక్రియ చేపడతామని తెలిపింది. పోస్టులు, జోన్‌లపై అభ్యర్థులు ప్రాధాన్యతలు ఇవ్వాల్సి ఉంటుందని వెల్లడించింది. అలాగే న్యాయం చేస్తానని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Srisailam Tunnel: ఒక్కసారిగా కూలిన పైకప్పు.. శ్రీశైలం టన్నెల్‌లో ప్రమాదం

AP Capital: అమరావతి పనుల ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 22 , 2025 | 02:48 PM